జూనియర్ ఎన్టీఆర్ పేరు పలకడానికి కూడా ఇష్టపడని బాలకృష్ణ.. నీకిది తగునా బాలయ్య!

గత కొంతకాలం నుంచి నందమూరి కుటుంబంలో అంతర్యుద్ధం నడుస్తుందని జూనియర్ ఎన్టీఆర్ మరియు బాలయ్య మధ్య చాలా పెద్ద గ్యాప్ ఏర్పడిందని అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం నడుస్తున్న సంఘటనలను చూస్తుంటే వారి మధ్య గ్యాప్ మరింత పెరిగిందని, తగ్గించుకునే ప్రయత్నం చేయటం లేదని అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందంటే ఆహా ఓటీపీ ఛానల్ లో బాలకృష్ణ పోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఒక ఎపిసోడ్కి ఒక్కొక్క మూవీ టీం వచ్చి సందడి చేస్తూ ఉంటుంది అలాగే తాజా ఎపిసోడ్ లో బాలయ్య బాబు షో కి అతను హీరోగా నటించిన డాకు మహారాజ్ మూవీ టీం వచ్చింది. ఈ టీంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రొడ్యూసర్ నాగ వంశీ డైరెక్టర్ బాబి ఉన్నారు. ఈ షోలో బాలయ్య బాబు ఎనర్జీ గురించి అందరికీ తెలిసిందే కదా అలాగే దీన్ని ఎంటర్టైన్ చేస్తూ డైరెక్టర్ బాబిని బాలయ్య ఎల్ఈడి మీద కొందరి హీరోల ఫోటోలని చూపించి వాళ్ళ గురించి ప్రశ్నలు వేశాడు డైరెక్టర్ బాబి ఇప్పటివరకు పని చేసిన హీరోలు అందరి ఫోటోలు చూపించారు.

కానీ అందులో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఫోటో మాత్రం పెట్టకపోవడం గమనార్హం.మరి అదే బాబీ.. ఎన్టీఆర్ద‌తో జై లవకుశ చేశాడు. కానీ అక్కడ ఎన్టీఆర్ బొమ్మ మాత్రం వేయలేదు. ఎన్టీఆర్ టాపిక్ రాకుండా కట్ చేశారు. ఇక తమన్ హారిక హాసిని క్రియేషన్స్ గురించి సీతార క్రియేషన్స్ గురించి మాట్లాడుతూ తాను చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టైంలోనే అరవింద సమేత, అల వైకుంఠపురములో, భీమ్లా నాయక్..

ఇప్పుడు డాకు ఇచ్చారు అంటూ తమన్ చెప్పుకుంటూ పోయాడు. అరవింద సమేత అనే పేరు రాగానే.. టాపిక్ డైవర్ట్ చేస్తూ.. నేషనల్ అవార్డు వచ్చింది వాళ్ల బ్యానర్లోనే అంటూ అల వైకుంఠపురములో గురించి బాలయ్య పరోక్షంగా స్పందించాడు. ఇక్కడ కూడా ఎన్టీఆర్ టాపిక్ రావడం ఇష్టంలేదని బాలయ్య పై ఫైర్ అవుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ అంటే ఏం బాలయ్యకి ముందు నుంచి అసూయ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.