ఇండియాను ఏలడం కోసమే ముంబై వెళ్లా.. రౌడీ హీరో కామెంట్స్ వైరల్!

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిత్ర పరిశ్రమంలో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ.అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గీత గోవిందం సినిమాతో మరో హిట్ అందుకుని వరుస సినిమా అవకాశాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోయారు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈయనకు ఏకంగా పాన్ ఇండియా స్థాయి సినిమాలో నటించే అవకాశం కల్పించారు.ఈ క్రమంలోనే లైగర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ చిత్ర బృందం వరంగల్ లో ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇకపోతే ఈ వేడుకలో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఈ సినిమా ప్రమోషన్ కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నప్పటికీ తన మనసు మాత్రం ఇక్కడే ఉందని అందుకే మొదట తెలుగు రాష్ట్రాలలోని సినిమా ఈవెంట్ మొదలు పెట్టామని తెలిపారు.

ఇక ఈ సినిమాలో సరూర్ నగర్ కు చెందిన ఓ తల్లి తన కొడుకుని తీసుకొని ముంబై వెళుతుందని ఇలా ముంబై వెళ్ళిన ఆమె తన కొడుకు ఛాంపియన్ కావాలని కోరుకుంటుందని తెలిపారు.ఇలా ఇండియాని షేక్ చేయడం కోసమే తల్లి కొడుకులు బొంబాయి వెళ్తారని మేము కూడా అంతే మా పాత్ర కూడా అంతే అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో తన పాత్ర గురించి వెల్లడించారు.ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో ప్రముఖ నటి రమ్యకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా విజయ్ దేవరకొండ ఈ సినిమా గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.