కుటుంబ కథ నేపథ్యంలో కుటుంబ విలువలను తెలియజేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి బుల్లితెర సీరియల్ జానకి కలగనలేదు ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకొని ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది.ఇక ఈ సీరియల్ ప్రతిరోజు ప్రసారమవుతూ ఎంతో అద్భుతమైన రేటింగ్ కైవసం చేసుకుంది. ఇకపోతే నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే…శివాలయంలో ప్రత్యేకంగా పూజలు చేయించాలని జ్ఞానాంబ కుటుంబ సభ్యులతో గుడికి వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడ కోనేరులో దీపాలను వెలిగించి రమ్మని తన కొడుకులు కోడళ్ళను పంపిస్తుంది.
ఇక దీపాలను వదులుతూ రామ జానకి ఐపీఎస్ కావాలని కోరుకుంటారు. ఇలా కోరుకోవడంతో తీరని కోరికలను కోరుకోకూడదు రామా గారు అంటూ జానకి చెప్పగా…మన పెళ్లి కాకముందు ఇక్కడ దీపాలు వదులుతున్న మిమ్మల్ని చూసాను ఇలాంటి అమ్మాయి పక్కన నేను నిలబడగలనా అని అనుకున్నాను. అది తీరని కోరిక అని అప్పుడు నాకు తెలుసు కానీ తీరింది కదా అంటూ రామ చెబుతాడు. మరోవైపు తన ప్రెగ్నెన్సీ విషయం బయటపడకూడదని మల్లికా కోరుకొని ఎలాగైనా జానకి దీపాలను ఆర్పి వేయాలని నీటిని పోస్తూ ఉంటారు.
ఈ క్రమంలోని చికిత మల్లికమ్మ గారు అలా చేస్తే జానకమ్మ దీపాలు ఆరిపోతాయి అంటూ చెప్పగా నువ్వు నోరు అంటూ చికిత పై కోప్పడుతుంది. అదే సమయంలో జానకి మల్లిక వైపు చూడగా మల్లికా గుటకలు మింగుతుంది. అంతలోనే మల్లికా వెలిగించిన దీపాలు మొత్తం నీటిలో మునిగిపోతాయి. ఇక అందరూ అక్కడి నుంచి మౌనంగా వచ్చి పూజలో కూర్చోగా ఏమైంది అంటూ జ్ఞానంబ ప్రశ్నిస్తుంది. అక్కడ జరిగినది మొత్తం మల్లికా చెప్పగా నీ తింగరి వేషాలు మానుకోవా అంటూ తనని తిడుతుంది.
ఇకపోతే హోమం చేసే సమయంలో మల్లికా కంగారు పడుతూ ఉండగా అది గమనించిన జ్ఞానంభ రేపు ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్లి స్కానింగ్ చేద్దాం కడుపులో బిడ్డ ఎలా ఉందో అనే కంగారు తగ్గిపోతుంది అంటూ మళ్ళీకకు షాక్ ఇస్తుంది. దీంతో స్కానింగ్ చేస్తే బయట పడుతుంది కదా అంటూ నోరు జారుతుంది మల్లికా. బయటపడిపోవడం ఏంటండీ జానకి గారు అంటూ రామ అడగగా జానకి ఏదో ఒకటి కవర్ చేస్తూ మాట్లాడుతుంది.
ఇక మల్లికా తన ప్రెగ్నెన్సీ బయట పడుతుందని కంగారుపడుతూ ఉండగా జానకి అప్పుడే కొబ్బరికాయలు తీసుకురావడానికి పక్కకు వెళుతుంది.ఇక అదే సమయంలో అక్కడికి వచ్చిన సునంద ఎలాగైనా వీరిని బాధ పెట్టాలని భావించి సూటిపోటి మాటలతో బాధపెడుతుంది. హోమం చేయడానికి జానకి లేకుండా ఇద్దరు కోడలతోనే చేస్తున్నావు వీళ్ళు తల్లి కాబోతున్నారనే కదా జ్ఞానంబ అంటూ దెప్పిపొడుస్తుంది.
ఈ మాటలు విన్న మల్లికా దేవుడా ఎక్కడ చూసినా నా ప్రెగ్నెన్సీ గురించే మాట్లాడుతున్నారు అంటూ ఆందోళన పడుతుంది.ఇక పెద్ద కోడలు గర్భవతి కాలేదని తనని పూజలో కూర్చోబెట్టలేదా అంటూ మాట్లాడుతుండగా అదే సమయంలోనే జానకి అక్కడికి వచ్చి సునంద అంటున్న మాటలకు తన మాటలతో నోరుమూయిస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.