క్రేజీ అప్డేట్ : సల్మాన్ సినిమాలో గ్లోబల్ స్టార్ క్యామియో రోల్.!

RamCharan (1)

గత కొన్ని రోజులు కితం బాలీవుడ్ లో ఓ భారీ సినిమాకి గాను పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా జవాన్ లో నటిస్తున్నట్టుగా టాక్ ఓ రేంజ్ లో సెన్సేషన్ గా మారింది. కానీ ఈ టాక్ తర్వాత అయితే సాధ్యం అయ్యేలా లేదని క్లారిటీ వచ్చేసింది.

కానీ ఇప్పుడు అయితే మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ పడనుంది అని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈసారి అయితే ఆ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కాగా క్యామియో లో కనిపించేది అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అట. తాను ఈ సినిమాలో కనిపించనున్నట్టుగా సినీ వర్గాలు ఇప్పుడు కన్ఫర్మ్ చేసాయి.

ఐతే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హిందీలో తమిళ రీమేక్ వేదాళం అది మన తెలుగు లో కాటమరాయుడు కి రీమేక్ గా చేస్తున్నారు. ఆ సినిమాలో విక్టరీ వెంకటేష్ మరియు పూజా హెగ్డే ఇంకా కొంతమంది టాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు. అయితే వీరితో పాటుగా రామ్ చరణ్ కూడా ఉంటాడని ఇపుడు టాక్.

అయితే వారంతా సినిమాలో కీలక పాత్రలు చేయగా రామ్ చరణ్ అయితే ఓ సాంగ్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. దీనితో సల్మాన్ మరియు రామ్ చరణ్ లు ఒకేసారి స్క్రీన్ పంచుకోనున్నారని కన్ఫర్మ్ అయ్యింది. కాగా ఈ సినిమాలో సాంగ్ కి జానీ మాస్టర్ వర్క్ చేయగా సినిమా ఈ ఏడాది ఈద్ పండుగ కానుకగా రిలీస్ కాబోతుంది.