జబర్దస్త్‌లో ఉన్నా కూడా నాగబాబుతో మంచి దోస్తీ.. గెటప్ శ్రీను వ్యవహారం మామూలుగా లేదు!!

Getup srinu Clicks NagababuPic

జబర్దస్త్ షో నుంచి నాగబాబు బయటకు వచ్చాక చాలా మార్పులే జరిగాయి. నాగబాబు మెగా కాంపౌడ్ మెప్పు పొందాలని గెటప్ శ్రీను, సుధీర్, రాం ప్రసాద్, హైపర్ ఆది ఇలా అందరూ ప్రయత్నిస్తుంటారు. పైగా ఈ అందరూ కూడా మెగా భక్తులే. చిరంజీవికో, పవన్ కళ్యాణ్‌కో వీరాభిమానులే. అయితే నాగబాబు బయటకు వచ్చాక.. అతనితో కలిసి రావాలిని బాగానే ప్రయత్నించారు. కానీ అది కుదరలేదు.

Getup srinu Clicks NagababuPic

మల్లెమాలతో ఉన్న బాండ్, అగ్రిమెంట్ల వల్ల జబర్దస్త్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే నాగబాబు వెంట రాలేదని కానీ, అదిరింది షోలోకి రాలేదని ఈ అందరి మధ్య దూరమేమీ పెరగలేదు. కేవలం చమ్మక్ చంద్ర మాత్రమే నాగబాబుతో కలిసి వెళ్లాడు. ఇప్పుడు బొమ్మ అదిరిందిలో చమ్మక్ చంద్ర బాగానే నడిపిస్తున్నాడు. అయితే నాగబాబుతో మాత్రం సుధీర్, ఆది, గెటప్ శ్రీను వంటి వారంతా మంచి దోస్తీనే కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఈ మధ్య నాగబాబు ఓ ఫోటోను షేర్ చేశాడు. తన పెట్ పెంపుడు కుక్క పీకూయే ఇక తన దిండు అంటూ చెబుతూ ఓ ఫోటోను షేర్ చేశాడు. అందులో బుజ్జి కుక్క మీద నాగబాబు పడుకుని ఉన్నాడు. ఆ ఫోటోను తీసింది గెటప్ శ్రీను. పిక్ క్రెడిట్ గెటప్ శ్రీనుకు ఇచ్చాడు నాగబాబు. అంటే జబర్దస్త్‌లో చేస్తున్నా కూడా పర్సనల్ టైంను మాత్రం నాగబాబుతో గడుపుతున్నట్టున్నారు. అలా వారు అక్కడా ఇక్కడా మంచి పేరే తెచ్చుకుంటున్నారన్న మాట.