తాజాగా దసరా రోజున హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సారథ్యంలో గురువారం జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో జరిగిన వివాదం తెలిసిందే. గరికపాటి నరసింహారావు, చిరంజీవి, పలువురు ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో చిరంజీవితో అభిమానులు ఫోటో సెషన్ దిగుతుంటే తన ప్రవచనాన్ని అది అయిపోయిన తర్వాతే ప్రారంభిస్తారని గరికపాటి గట్టిగా చెప్పడం వివాదానికి దారితీసింది.
తమ అభిమాన హీరోని అలా అంటారా అని… మెగా ఫాన్స్ గరికపాటి ప్రసంగాలని అడ్డుకుంటాము అని సోషల్ మీడియాలో వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ విషయం ఎంతో దూరం దారితీస్తుంది అని అందరూ ఊహించారు. గరికపాటి గారు మాత్రం చిరంజీవితో తనకి ఎలాంటి శత్రుత్వం లేదని అతని ఎంతో సహృదుడు అని చెప్పారు. అలాగే చిరు గరికపాటి గారిని తన ఇంటికి భోజనానికి కూడా పిలిచారని గరికపాటి చెప్పడం గమనార్హం. దీంతోపాటు వారి ఫాన్స్ వద్ద నుండి కూడా వ్యక్తిగతంగా తనకి ఎటువంటి రీతిలో దూషణలు రాలేదని చెప్పారు. మరి మెగా ఫాన్స్ ఆవేశంతో పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటిని ఏమంటారో అని అనుకున్న వారందరికీ గరికపాటి అసలు అటువంటిది తాను ఏది ఎదుర్కోలేదని చెప్పడం కొద్దిగా ఆశ్చర్యం కలిగించే విషయమే.