Boycott Bhairavam: నోటి దూల… ట్రెండింగ్ లో బాయ్ కాట్ బైరవం… ఇక మీరు మారరా?

Boycott Bhairavam: సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు.. చాలామంది సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించి అనంతరం రాజకీయాలలోకి వస్తున్నారు. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా సినిమా ఇండస్ట్రీకి చెందినవారు రాజకీయాలలో ఉన్నప్పటికీ సినిమా వేదికలపై కేవలం సినిమా విషయాలు మాట్లాడితే పరవాలేదు కానీ రాజకీయ అంశాలు మాట్లాడితే మాత్రం ఆ సినిమాకు ఊహించనంత నష్టం వస్తుంది అనే సంగతి ఇది వరకు ఎన్నో సినిమాలు నిరూపించాయి.

ఇటీవల లైలా సినిమా వేడుకల్లో కూడా గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కమెడియన్ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యల కారణంగా సినిమా ఎలాంటి ఫలితం అందుకుందో అందరికీ తెలిసినదే. ఇలా లైలా సినిమా ఫలితం చూసినప్పటికీ కొంతమంది దర్శకులు సెలబ్రిటీల తీరు మారలేదని సినిమా వేదికలపై రాజకీయ అంశాలు గురించి మాట్లాడుతూ చిక్కుల్లో పడేస్తున్నారని చెప్పాలి. తాజాగా భైరవం డైరెక్టర్ సైతం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు.

విజయ్ కనకమెడల దర్శకత్వంలో నారా రోహిత్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం భైరవం ఈ సినిమా మే 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి తరుణంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇటీవల ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ని ఏపీలో పెద్ద ఎత్తున నిర్వహించింది. అయితే ఆ స్టేజ్‌పై దర్శకుడు విజయ్‌ కనకమేడల చేసిన కామెంట్స్‌ కాంట్రవర్సీకి దారి తీశాయి.

ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ…. ధర్మాన్ని కాపాడటం కోసం ఎప్పుడో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు.కరెక్టుగా సంవత్సరం క్రితం మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరు వచ్చారు’అని సినిమా ఈవెంట్‌లో పొలిటికల్‌ కామెంట్స్‌ చేశాడు. దీంతో వైఎస్సార్‌సీసీ శ్రేణులు విజయ్‌ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భం లేకపోయినా..ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే బాయ్ కాట్ బైరవం అంటూ ఒక హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా వివాదంలో చిక్కుకుందనే చెప్పాలి అయితే ఇప్పటివరకు ఈ విషయంపై డైరెక్టర్ ఎక్కడ స్పందించలేదు.