అల్లు అర్జున్ మళ్ళీ కెలికాడు.!

అల్లు అర్జున్ 20 ఏళ్ళ ప్రస్తానంపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘గర్వపడుతున్నాను’ అంటూ అల్లు అర్జున్ ఎదుగుదలపై ఆనందం వ్యక్తం చేశారు చిరంజీవి. అంత ఆప్యాయంగా చిరంజీవి ట్వీట్ చేసినా, అల్లు అర్జున్ నుంచి సరైన రెస్పాన్స్ వుండటంలేదంటూ కొందరు మెగా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

ఏదో చిరంజీవి తాపత్రయం తప్ప అల్లు అర్జున్‌కి అంత సీను లేదు.. చిరంజీవి అంటే అసలు రెస్పాన్సే లేదు.. అని సోషల్ మీడియా వేదికగా దుష్ర్పచారం చేస్తున్నారు. కానీ, ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, ‘మీ పట్ల ఎప్పటికీ గౌరవం వుంటుంది..’ అంటూ అల్లు అర్జున్ స్పందించాడు.

అంతా బాగానే వుంది కానీ, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తారలంతా చరణ్‌ని అభినందిస్తూ గ్రీటింగ్స్ పంపించారు. కానీ, అల్లు అర్జున్ నుంచి చరణ్‌కి ఎలాంటి గ్రీటింగ్స్ రాలేదు. ఈ విషయంపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు  చిరంజీవినీ ట్రోల్ చేస్తున్నారు.