డైరెక్టర్ బాబీ ని తిడుతున్న మెగా ఫాన్స్

మెగాస్టార్ చిరజీవి లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ హిట్ టాక్ తెచ్చుకున్నా కానీ కలెక్షన్స్ మాత్రం అంతంగానే ఉన్నాయి. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఈ మూవీ కూడా ప్లాప్. చాన్నాళ్ల తర్వాత మెగాస్టార్ పూర్తి మాస్ లుక్ లో ‘వాల్తేరు వీరయ్య’ లో కనిపించనున్నాడు. ఈ సినిమా టీజర్ దీపావళి సందర్భంగా రిలీజ్ అయ్యింది.

చిరంజీవి లుక్స్, మ్యానరిజం చిరంజీవి పాత సినిమాలు గ్యాంగ్ లీడర్, ముఠా మేస్త్రి ని గుర్తు చేస్తున్నాయని కొంత మంది అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. కానీ కొందరు మాత్రం డైరెక్టర్ బాబీ ని తిడుతున్నారు. నిజానికి చిరంజీవికి స్మోకింగ్ అలవాటు లేదు కానీ కొన్ని సినిమాలు టైంలో అలాంటి రోల్స్ కోసం మిల్క్ మేడ్ సిగిరేట్స్ ని తాగేవారు .

కానీ ఈ సినిమా కోసం అలా పొగను ఊదడానికి రింగులుగా రావడానికి మెగాస్టార్ చిరంజీవి నిజంగానే స్మోకింగ్ చేశారని ఓ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు ఇలా చేయమని చెప్పింది డైరెక్టర్ బాబీనే ఆట . ఈ క్రమంలోనే బాబిని మెగా ఫాన్స్ తిట్టి పోస్తున్నారు. మా చిరంజీవి చేత ఇలాంటి పని చేయిస్తావా నువ్వు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

అలాగే ఈ సినిమాలో చిరంజీవి లుక్ ‘అందరివాడు’ సినిమాలో గోవిందరాజులు ని గుర్తుచేస్తుంది అంటున్నారు. ఆ సినిమాలాగే ఇది కూడా ప్లాప్ అవుతుందేమో అని కూడా భయపడుతున్నారు.