Bigg boss 4: మాంచి జోష్ మీదున్న గంగవ్వ.. అందరి ఫేవరేట్ గంగవ్వే… హౌస్ మొత్తం ఆమెకే మద్దతు

Gangavva josh in bigg boss house

గంగవ్వ.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఈమె ఫేవరేట్ కంటెస్టెంట్. హౌస్ లోనే కాదు బయట కూడా గంగవ్వే ఆల్ టైమ్ ఫేవరేట్. అందరు కంటెస్టెంట్లు ఒక ఎత్తు అయితే గంగవ్వ ఇంకో ఎత్తు. అసలు గంగవ్వ బిగ్ బాస్ హౌస్ దాకా వెళ్లడం అంటేనే అదో రికార్డు. ఆ వయసులో ఉన్న ఎవరైనా కృష్ణా రామా అంటూ కాటికి కాళ్లు చాపుకొని కూర్చుంటారు. కానీ.. విజయానికి వయస్సుతో పనిలేదని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది గంగవ్వే. అందుకే తెలుగు రాష్ట్రాల్లోనూ గంగవ్వే ఈ సీజన్ లో ఫేవరేట్ కంటెస్టెంట్. మరోవైపు ఇంటి సభ్యులు కూడా గంగవ్వకే ఓటు వేస్తున్నారు. గంగవ్వను మంచిగా చూసుకుంటున్నారు.

Gangavva josh in bigg boss house
Gangavva josh in bigg boss house

దీంతో హౌస్ లోనూ గంగవ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఏ కంటెస్టెంట్ అయినా ఆమెను తమ అమ్మమ్మో లేదా నానమ్మో అన్నట్టుగా సొంతమనిషిలా చూసుకుంటున్నారు. తనను కాళ్లు కూడా కింద పెట్టనీయడం లేదు అంటే అతిశయోక్తి కాదు.

Gangavva josh in bigg boss house
Gangavva josh in bigg boss house

ఇక నిన్నటి వరకు గొడవలతో నిండిన హౌస్ లో ఇవాళ కాస్త జోష్ కనిపించింది. హౌస్ మొత్తం ఇవాళ మాంచి ఫ్లోలో ఉంది. కంటెస్టెంట్లు కూడా మాంచి జోరుమీదున్నారు.

ఇవాళ్టి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను పోస్ట్ చేశారు. ఆ ప్రోమోలో గంగవ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అందరినీ పలకరిస్తూ.. అందరితో కలిసి డ్యాన్సులు చేస్తూ.. వ్యాయామం చేస్తూ అలరించింది. అందుకే గంగవ్వ అంటే ఇష్టం ఉండని కంటెస్టెంటు ఎవరు ఉంటారు చెప్పండి.

Manchi flow lo unnaru antha...special ga mana #Gangavva josh 👌 🔥 #BiggBossTelugu4 Today at 9:30 PM