హీరో స్వయంగా అడిగితే నో చెప్పిన హీరోయిన్.!

అప్పట్లో హాట్ హీరోయిన్ ఆ ముద్దుగుమ్మ. ఇప్పుడేమో ఇద్దరు పిల్లలకు తల్లి. అదే ఇప్పుడు జాతీయ సమస్య మరి. అంతేగా హీరోలకు పెళ్లిళ్లయ్యి తాతలయినా ఏ మాత్రం ఫరక్ పడదు. కానీ, హీరోయిన్లకు అలా కాదే.!

పెళ్లయితేనే సరి, పక్కన పెట్టేస్తారు. హీరోయిన్ రోల్స్‌కి పనికి రావంటారు. అక్క పాత్రలో, వదిన పాత్రలో ఆఫర్ చేస్తుంటారు. సరిపెట్టుకుంటే సరిపెట్టుకున్నట్లు. లేదంటే అక్కడితో కెరీర్ ఖతమ్.! దుకాణ్ బంద్.!

అదే పరిస్థితి తాజాగా ఓ హీరోయిన్‌కి వచ్చింది. ఆ హీరో, ఆ హీరోయిన్ ఒకప్పుడు ఆన్ స్ర్కీన్ భీభత్సమైన రొమాన్స్ పండించారు. ఇప్పుడేమో ఓ సినిమా కోసం సదరు హీరో ఆ హీరోయిన్‌ని స్పెషల్ రోల్ కోసం సంప్రదించారు.

స్పెషల్ రోల్ అంటే.. అత్త పాత్ర లాంటిదట. మరీ దారుణం కదా. దాంతో, ఆమె సింపుల్‌గా నో చెప్పేసిందట. ఇందులో వింతేముంది.! నిజానికి చెయ్యొచ్చు.

కానీ, చేయనంటోందామె. ఆ హీరో, హీరోయిన్ల మధ్య గతంలో ఎఫైర్ నడిపింది. అభిమానులు ఆమెని వదినా.! అని పిలుచుకుంటూ తమ అభిమాన హీరోకి భార్యగా ఊహించేసుకున్నారు.

కానీ, సీను రివర్స్ అయ్యిందనుకోండి.. ఆ ఎఫైర్ బ్రేకప్ కావడం.. ఎవరి దారి వారు చూసుకోవడం అన్నీ జరిగిపోయాయ్. లాంగ్ గ్యాప్ తర్వాత ఆ హీరోయిన్ మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటోందట.

ఆ విషయం తెలిసిన సదరు హీరో తన సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఆఫర్ చేశాడట. అందుకు ఆమె రిజక్ట్ చేసిందట. ఇంతకీ ఎవరా హీరోయిన్.? ఎవరా హీరో.? జస్ట్ గెస్ ఇట్.!