Narne Nithin: ఎన్టీఆర్ బామ్మర్ది.. మూడు హిట్ల తరువాత మొదటి సినిమా!

సాధారణంగా ఎవరైనా హీరో మూడు హిట్లు కొడితే ఆత్మవిశ్వాసంతో వరుస సినిమాలు ప్లాన్ చేస్తారు. కానీ ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ నార్నె మాత్రం తన తొలి సినిమా రిలీజ్ కాకముందే యూత్‌ఫుల్ హిట్‌లతో నిలబడ్డాడు. ‘మ్యాడ్’, ‘ఆయ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ లాంటి సినిమాల్లో భాగం అయినా.. తన పర్సనల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్, ఇప్పుడు ఎట్టకేలకు ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ అనే టైటిల్‌తో థియేటర్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇది ఆయన అసలు డెబ్యూ సినిమా కావడం విశేషం.

ఈ చిత్రం పేరు వినగానే మాస్ ఫీలింగ్ స్పష్టంగా తెలుస్తోంది. పైగా దర్శకుడు సతీష్ వేగేశ్న కావడం, కథలో యాక్షన్‌తో పాటు ప్రేమ కూడా ఉండబోతోందని చెప్పకనే చెబుతోంది. కానీ ఈ సినిమా రెండు సంవత్సరాల కిందటే పూర్తి అయి, ఇప్పటి వరకు ఓ సరైన విడుదల తేదీ కోసం అల్లాడటం ఆశ్చర్యంగా మారింది. ఈ గ్యాప్ వల్ల వచ్చిన మార్పు నితిన్ మార్కెట్ పెరగడం నిర్మాతలకు ఓ ఫేవర్ అయితే, ఇప్పటి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఇది నార్నెకి హిట్ లైన్ మీద పడ్డ టైమింగ్‌ని డిల్యూట్ చేయడమే అన్న టాక్ వినిపిస్తోంది.

ఇక ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలు కూడా మారాయి. నితిన్ నార్నెను ఓ యూత్ ఫుల్ కామెడీ హీరోగా చూస్తున్నారు. అలాంటిది ‘మాస్ టచ్’ ఉన్న సినిమా ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. టైటిల్‌లో మూడు ‘శ్రీ’లతో రాయలసీమ యాస మిక్స్ చేస్తున్న ఈ సినిమా, తనకు మునుపటి హిట్‌లను మించిన ఓ ప్రత్యేక గుర్తింపునిచ్చేనా లేక ఒక ఎలాగైనా రిలీజ్ చేయాల్సిన సినిమా గా మిగిలిపోతుందా అనేది తేలాల్సి ఉంది.