ఇండస్ట్రీ బజ్ : ఫైనల్ గా “ఎన్టీఆర్ 30” మొదలయ్యేది అప్పుడేనట.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) తో తన కెరీర్ లో సెన్సేషనల్ హిట్ ని తాను అందుకోగా ఈ సినిమా అనంతరం మళ్ళీ తన కెరీర్ లో 30వ సినిమాని అందులోని దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నాడు.

అయితే ఈ సినిమాపై భారీ స్థాయి అంచనాలు పాన్ ఇండియా లెవెల్లో నెలకొనగా నెక్స్ట్ ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇది హీరోయిన్ సెట్టవ్వక అలా వాయిదా పడుతూ వస్తుంది కానీ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి అది కూడా కొంతమంది ట్రస్టడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అలాగే ఇంకా హీరోయిన్ ఎవరు అనేది కూడా ఇంకా ఫైనల్ కాలేదు కానీ మొత్తానికి అయితే సినిమాని మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచే స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నారట.

ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీత దర్శకునిగా ఫిక్స్ అవ్వగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మాణం వహిస్తున్నారు.