మొత్తానికి బాలయ్య కోసం ఈ బ్యూటీనే ఫిక్స్ చేశారట.!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో వచ్చిన సినిమాలో ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన చిత్రం “వీరసింహా రెడ్డి” కూడా ఒకటి. అయితే ఈ సినిమా రిలీజ్ బాలయ్య సెన్సేషనల్ హిట్ అఖండ తర్వాత రాగా దీనిపై హైప్ అమాంతం పెరిగింది. దీనితో అఖండ లో సగం వసూళ్లు మొదటి రోజే వచ్చేసాయి.

అయితే ఆ సినిమాతో పోలిస్తే ఇది హిట్టే కానీ పూర్తి స్థాయిలో వీరసింహా రెడ్డి భారీ లాభాలు ఇవ్వలేకపోయింది. అయినా కూడా నెక్స్ట్ బాలయ్య చేసే 108వ సినిమాపై సాలిడ్ హైప్ ఉంది. ఈ సినిమాని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండగా “బ్రో ఐ డోంట్ కేర్” అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్టు రూమర్స్ కూడా ఉన్నాయి.

అయితే మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే అంశం ఇప్పుడు ఫైనల్ గా ఖరారు అయినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ గా ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పేరునే మేకర్స్ ఫైనల్ చేశారట. దీనితో బహుశా మొదటి సారి బాలయ్య సరసన కాజల్ కనిపించబోతుంది.

కాగా ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఓ కీలక పాత్ర చేస్తుండగా థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే షైన్ స్క్రీన్ సినిమాస్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.మరో పక్క కాజల్ కూడా మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతూ ఉండగా నిన్ననే తమిళ పాన్ ఇండియా సినిమా భారతీయుడు 2 షూట్ లో కూడా కమల్ హాసన్ తో పాల్గొంది.