టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ క్రేజీ హీరోయిన్ సమంత అనారోగ్య సమస్యతో బాధపడుతూ తన సినిమా షూటింగులకు సినిమా ప్రమోషన్లకు దూరమైన విషయం మనకు తెలిసిందే.అయితే ఈమె నటించిన యశోద సినిమా నవంబర్ 11వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సమంత అనారోగ్య సమస్య కారణంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే యాంకర్ సుమతో కలిసి రికార్డెడ్ ఇంటర్వ్యూలను నిర్వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే యాంకర్ సుమ సమంతతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా తన ఆరోగ్యం పై స్పందిస్తూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే సమంత స్పందిస్తూ తాను తను చేసిన పోస్టులు కొన్ని మంచి రోజులు కొన్ని చెడు రోజులు వచ్చాయని ఒక్కోసారి అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనే పరిస్థితి నుంచి ఇక్కడి వరకు వచ్చాననే భావన తనలో కలిగింది అంటూ ఈ సందర్భంగా మరోసారి తన అనారోగ్యం గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.
తాను బాధపడుతున్న సమస్య కొంచెం కఠినమే అయినప్పటికీ తాను పోరాడానని అయితే తన ఆరోగ్యం గురించి వస్తున్నటువంటి వార్తలు చూసి తనకు ఆశ్చర్యం వేసిందని తెలిపారు. తాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్న మాట నిజమే కానీ మరీ చనిపోయే అంత పరిస్థితులలో తాను లేనని తాను ఇంకా బ్రతికే ఉన్నానంటూ ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.సమంత ఇలా ఎమోషనల్ కావడంతో సుమ మీరు ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీ కనుక మీ గురించి ఇలాంటి వార్తలు వస్తాయి. మనం ఏమి చేయలేం అంటూ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.