బిగ్ న్యూస్ : తల్లిదండ్రులు అయ్యిన చరణ్, ఉపాసన కొణిదెల.!

మెగాస్టార్ చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇపుడు గ్లోబల్ వైడ్ గా కూడా భారీ క్రేజ్ ని ఇప్పుడు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి చరణ్ అయితే ఉపాసన ని పెళ్లి చేసుకున్న ఇన్నేళ్ల తర్వాత అయితే వారు తమ లైఫ్ లో ఓ బిగ్ గుడ్ న్యూస్ ని అయితే ఈ ఏడాదితో రివీల్ చేశారు.

తాము అతి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్టుగా కొన్ని నెలల కితం గుడ్ న్యూస్ ని రివీల్ చేయగా వారిపై అప్పటివరకు ఎన్నో నీచమైన ఆరోపణలు చేసినవారికి అయితే చెంప పెట్టుగా సమాధానం ఇచ్చారు. ఇక ఫైనల్ గా అయితే ఈరోజు జూన్ 20న రామ్ చరణ్ మరియు ఉపాసన కొణిదెల లు తెల్లవారు జామున ఓ ఆడబిడ్డకు అయితే జన్మనిచ్చి తమ కుటుంబంలోకి ఓ కొత్త సభ్యురాలిని ఆహ్వానించారు.

దీనితో ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. అలాగే ఈ వార్తతో అయితే మెగా ఫాన్స్ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుండగా చరణ్ మరియు ఉపాసన లకు అయితే అభినందనలు తెలియజేస్తూ తాము ఈరోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రి దగ్గరకి భారీగా తరలి వెళ్లనున్నట్టుగా తెలిపారు.

అయితే ఇందుకు పలు ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఆసుపత్రి దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా చరణ్ ఉపాసనలకు తమ అభినందలు తెలియజేసేలా సన్నాహాలు చేసుకున్నారని తెలిసింది. దీనితో అయితే మొత్తానికి మెగాస్టార్ తాత అయ్యారని చెప్పాలి.