బాక్సాఫీస్ : మొత్తానికి హిందీలో చరిత్ర సృష్టించిన “పఠాన్”

గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ సినిమా దగ్గర నెలకొన్న బాక్సాఫీస్ సంక్షోభాన్ని చూసి ఇతర ఇండస్ట్రీ లకే పాపం అనిపించింది. వారు కోరుకుంటున్న ఒక్క హిట్ తమ అసలైన రేంజ్ హిట్ కోసం చూస్తున్నప్పుడు వచ్చాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తన “పఠాన్” చిత్రంతో. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా బాలీవుడ్ కన్నా ముందు షారుఖ్ ఖాన్ ని కం బ్యాక్ లా నిలవాల్సి ఉంది.

ఈ భారీ టార్గెట్స్ తో వచ్చిన ఈ సినిమా సింపుల్ టాక్ నే అందుకుంది కానీ ఆ టాక్ తో కూడా షారుఖ్ ఖాన్ మ్యాజిక్ చేసాడు. ఈ టాక్ తో ఏకంగా సినిమాగా 1000 కోట్ల వసూళ్ల సినిమాగా నిలిపాడు. అయితే వీటి అన్నిటికన్నా తమ మార్కెట్ లో పాగా వేసిన మన భారీ చిత్రం “బాహుబలి 2” ఇప్పటివరకు అయితే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఉంది.

అయితే పఠాన్ స్పీడ్ తో బాహుబలి ని కూడా దాటుతుంది అని ట్రేడ్ అనుకున్నారు. అనుకున్నట్టు గానే ఫైనల్ గా సినిమా బాహుబలి పేరిట ఉన్న 510 కోట్ల గ్రాస్ వసూళ్లను హిందీ వెర్షన్ లోనే ఇప్పుడు పఠాన్ లెక్క 511 కోట్లతో బద్దలు కొట్టింది. దీనితో ఇప్పుడు అఫీషియల్ గా హిందీలో పఠాన్ సినిమానే హైయెస్ట్ వసూళ్లు అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది.

దీనితో దాదాపుగా ఆరేళ్ళ పాటు చెక్కు చెదరకుండా ఉన్న రికార్డు అయితే షారుఖ్ ఖాన్ బద్దలు కొట్టి సత్తా చాటారు. మరి ఇప్పటికీ పఠాన్ వసూళ్లు హవా కొనసాగుతుంది. హిందీలో వచ్చిన రీసెంట్ సినిమాలు ఏవి కూడా పెద్దగా రాణించలేదు. ఫైనల్ ఫిగర్ అయితే ఎక్కడ ఆగుతుందో చూడాలి. కాగా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక ఎక్స్ టెండెడ్ క్యామియో లో నటించగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించింది.