RRR: రాజమౌళి తన పాత ఇంటర్వ్యూలో మల్టీస్టారర్ సినిమాల గురించి మాట్లాడుతూ హీరోలకు ఏం పట్టింపులు ఉండవని వారు మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధంగా ఉన్న వారి అభిమానులకు మాత్రం చాలా పట్టింపులు ఉంటాయని అందుకే ముఖ్యంగా తెలుగులో ఎక్కువ మల్టీ స్టారర్ సినిమాలు తీయడానికి దర్శకులు ఆసక్తి చూపడం లేదని చెప్పారు. ఈ విషయమైన గతంలోది అయిన ఎప్పటికి అభిమానుల్లో ఎటువంటి మార్పు రాలేదు. మొన్నా మధ్య మహేష్ బాబు కూడా మేము బాగుంటాం అభిమానులు కూడా అలాగే కలిసి ఉండండి అని హితవు పలికారు.
ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటించడం అన్ని సినిమా పరిశ్రమల్లో మాములే అయితే తెలుగులో మాత్రం చాలా తక్కువగా ఇద్దరు పెద్ద హీరోలు ఒక సినిమాలో కలిసి నటిస్తుంటారు. దీనికి ముఖ్య కారణం ఇద్దరి హీరోల ఇమేజ్ ను దర్శకుడు బ్యాలెన్స్ చేయగలగడం. ఇదే మల్టీ స్టార్రర్ సినిమాలు ఎక్కువగా రాకపోడానికి కారణం. ఇపుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి ఇద్దరు పెద్ద హీరోలను ఒకే స్క్రీన్ పై చూపిస్తున్నాడు. కథ పరంగా ఇద్దరు హీరోలకు న్యాయం చేస్తాడు రాజమౌళి. టాలీవుడ్ టాప్ హీరోస్ అయినా ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరిని ఒకే సినిమాలో సమంగా చూపించబోతున్నాడు. ఏ మాత్రం తేడా జరిగిన ఆ ప్రభావం రాజమౌళి తదుపరి చిత్రాలపై ఖచ్చితంగా ఉంటుంది.
మాస్ ఇమేజ్ ఉన్న ఇద్దరు బడా స్టార్లను హ్యాండిల్ చేసి, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా షూటింగ్ ముగించుకుని, విడుదలకు సిద్ధమైన రాజమౌళికి ఇప్పుడు టెన్షన్ మొదలయ్యిందా?యుఎస్ లో ‘తొక్కుకుంటూ పోవాలే’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గాలిలో చేసిన విన్యాసాలతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. ఏదైనా తమ హీరో బరిలోకి దిగనంతవరకే అన్నట్లుగా ‘వేటగాడు వచ్చేటంతవరకే’ అన్న డైలాగ్ తో యాష్ ట్యాగ్ ను వినియోగించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ కు శ్రీకారం చుట్టారు.
ఈ అభిమాన ప్రదర్శన ఎవరి హీరోల గురించి వారు చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ తమ హీరోనే గొప్ప అనే విధంగా చాటుకుంటుంటేనే అసలు సమస్య తలెత్తుతోంది. సోషల్ మీడియాను విస్తృతంగా విశ్లేషణ చేసే రాజమౌళి దృష్టికి ఈ విషయం వెళ్లకుండా ఉండదు. బహుశా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గానీ, ప్రమోషన్ ఇంటర్వ్యూలలో గానీ ఈ ఫ్యాన్స్ వార్ కు బ్రేకులు పడే విధంగా ప్రసగింస్తారేమో చూడాలి.