Prabhas : సినీ పరిశ్రమ ఆ హీరోను మోసం చేసిందట..?

 

Prabhas: సినీ పరిశ్రమలో ఎదుటి వారికి సహాయం చేసే వారిలో ప్రభాస్ ముందుంటారని చెప్పుకోవచ్చు. ప్రభాస్ మనసు బంగారం అని, దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అంటారు. ప్రభాస్ చాలా మందికి సహాయం చేస్తూ ఉంటారు కానీ చేసిన విషయం కూడా చాలా మందికి తెలియదు. బాహుబలి సినిమా తో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్, ఆ ఇమేజ్ ని కూడా పక్కనపెట్టి చిన్న సినిమాలను, హీరోలను, డైరెక్టర్లను ప్రమోట్ చేయడంలో వెనకాడలేదు.

జాతి రత్నాలు వంటి చిన్న సినిమాలు, ప్రభాస్ ప్రమోషన్లలో పాల్గొనడం వల్ల చాలా లాభపడ్డాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభాస్ నీ ఎవరు సపోర్ట్ చేయకపోవడం వలన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.రాధేశ్యామ్ సినిమా గురించి ఏ ఒక్క సెలబ్రెటీ కూడా చిత్ర విడుదల గురించి కానీ, చిత్రం మీద వాళ్ళ అభిప్రాయం గురించి కానీ తెలియజేయలేదని అభిప్రాయపడ్డారు. ఎవరో కొంత మంది హీరోలు దర్శకులు సినిమా మీద వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారని, అలాంటివి కొద్దిగా సినిమా కు సహాయ పడిందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తపరుస్తున్నారు.

సినీ పరిశ్రమ వ్యూహాత్మక మౌనం వలనే రాధేశ్యామ్ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదని అభిమానుల అభిప్రాయం. చిన్న సినిమాలకు సంబంధించి,ఎవరైనా ప్రభాస్ ను సంప్రదించి సహాయం కోరితే ప్రభాస్ కూడా మౌనంగానే ఉండాలని అభిమానులు సలహా ఇస్తున్నారు.