అలాంటివి వద్దు పవర్ స్టారూ.!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) కోసం మార్షల్ ఆర్ట్స్ గెటప్‌లో కనిపిస్తున్నారాయన. అయితే, అలాంటివి వద్దని ఆయన సన్నిహితులూ, అభిమానులూ సూచిస్తున్నారట.

ఒకప్పుడు మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించిన సన్నివేశాల్లో చాలా అలవోకగా నటించేశారు పవన్ కళ్యాణ్. కానీ, అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. వయసు మీద పడుతోంది. గతంలో మాదిరి తెరపై వేగంగా కదల్లేకపోతున్నారాయన. రాజకీయాల కారణంగా ఫిట్‌నెస్ కూడా కోల్పోయారు.

సో, తాజాగా కనిపిస్తున్న మార్షల్ ఆర్ట్స్ గెటప్ కేవలం ప్రమోషన్స్ కోసమే అయితే ఫర్వాలేదు. కానీ, సినిమాలో చేయాల్సి వస్తే మాత్రం వద్దు బాబోయ్ అని ఆయన అభిమానులే అంటున్నారట. ‘ఓజీ’ సినిమా కోసం పవన్ కళ్యాణ్ చాలా కష్టపడుతున్నారనీ అంటున్నారు. ఆల్రెడీ ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం యాక్షన్ ఎపిసోడ్లలో ఇరగదీసేస్తున్నారు. తొడ కొట్టి మరీ ముష్టి యుద్దంలో దుమ్ము దులిపేస్తున్నారు.

‘ఓజీ’ కోసం ఇంకెంత పవర్ ‌ఫుల్ యాక్షన్ ఇవ్వబోతున్నారో.. తెలియాలంటే, లెట్స్ వెయిట్ అండ్ సీ.!