‘ఫ్యామిలీ స్టార్‌’ నుంచి కళ్యాణి వచ్చా..వచ్చా పాట విడుదల

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘ఫ్యామిలీస్టార్‌’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ‘కల్యాణి వచ్చా వచ్చా…’ అంటూ సాగే యుగళ గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా, గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చారు.

మంగ్లీ, కార్తీక్‌ ఆలపించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌పై దిల్‌రాజు, శీరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరుశురామ్‌ పెట్ల దర్శకుడు. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్‌.