‘ఫ్యామిలీస్టార్‌’ విడుదలకు రెడీ…

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. ‘గీతగోవిందం’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాళ్‌ ఠాకూర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌ షూరు చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు టీజర్‌ విడుదల చేయగా మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది.

ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి మేకర్స్‌ సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్‌ పూర్తయినట్లు విజయ్‌ దేవరకొండ తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. దీనితో పాటు ఒక షార్ట్‌ వీడియో కూడా పంచుకున్నాడు. ఇక ఈ సినిమాలో కుటుంబ బాగోగులు చూసుకునే ఫ్యామిలీ మ్యాన్‌గా, బయట రౌడీల బెండు తీసే పవర్‌ఫుల్‌ మ్యాన్‌గా విజయ్‌ దేవకొండ ఇందులో కనిపించనున్నారు. కూల్‌ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనున్న ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తుండగా.. ఎస్‌వీసీ బ్యానర్‌లో వస్తున్న 54వ చిత్రమిది.