రౌడీ హీరోకి లక్కీ మస్కట్ మృనాల్ ఠాకూర్

లక్కు తోక తొక్కేసినట్టేనా.? ‘గీత గోవిందం’ తరహా హిట్టు విజయ్ దేవరకొండకి పడినట్టేనా.? ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా చుట్టూ ఇంతటి పాజిటివ్ ప్రీ బజ్.. బహుశా విజయ్ దేవరకొండ కూడా ఊహించి వుండడు.

‘ఖుషీ’ సినిమాకి కూడా చాలా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యిందిగానీ, సమంత – విజయ్ దేవరకొండ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఒకింత ‘ఆడ్’గా మారడం, ఆ సినిమాకి పెద్ద మైనస్. మృనాల్ ఠాకూర్ విషయంలో అలా కాదు, ఏదో మ్యాజిక్ వుందామెలో.

సినిమా ప్రోమోస్ అన్నీ ఒకదాన్ని మించి ఇంకోటి వుంటున్నాయ్. ఫ్యామిలీ మ్యాన్‌లా కనిపిస్తున్నాడు, మాస్ అప్పీల్‌తోనూ సందడి చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. రౌడీ హీరో తెరపై ఏం చేస్తున్నా, అతన్ని డామినేట్ చేసేస్తోంది మృణాల్ ఠాకూర్ తన లుక్స్‌తో.

సినిమా ప్రమోస్ అన్నీ, మృనాల్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారట. విజయ్ దేవరకొండ ఈ విషయంలో, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట కూడా. మృనాల్ ఠాకూర్ కూడా సినిమా పబ్లిసిటీ కోసం అదనంగా డేట్స్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడంలో మృనాల్ ఠాకూర్ రూటే సెపరేటు. విజయ్ దేవరకొండ ఎలాగూ ఈ విషయంలో ‘మాస్టర్’ అనుకోండి.. అది వేరే సంగతి. మృనాల్ తనకు లక్కీ మస్కట్.. అని సన్నిహితుల దగ్గర విజయ్ దేవరకొండ చెప్పేసుకుంటున్నాడట.

అన్నట్టు, సమంతని కూడా ‘ఖుషీ’ విషయంలో లక్కీ మస్కట్‌గానే భావించాడు విజయ్ దేవరకొండ. ఫర్వాలేదు.. అన్న దగ్గర్నుంచి, ఫ్లాప్ వరకూ వెళ్ళింది ఆ సినిమా. ‘ఫ్యామిలీ స్టార్’ ఏమవుతుందో వేచి చూడాలిక.