‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీ ప్రమోషన్స్‌ షురూ…

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాళ్‌ ఠాకూర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తుండగా.. ఎస్‌వీసీ బ్యానర్‌లో వస్తున్న 54వ చిత్రమిది. ఈ సినిమా ఏప్రిల్‌ 05న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌ షూరు చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేయగా మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఇదిలావుంటే ఈ మూవీలో మృణాళ్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే మృణాళ్‌ కాకుండా మరో కొత్త కథనాయిక ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అమెరికన్‌ నటి ’మరిస్సా రోజ్‌ గార్డన్‌’ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. అలాగే మజిలీ మూవీ హీరోయిన్‌ ’దివ్యాంశ కౌశిక్‌’ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ది గ్రేవ్‌, బ్లడ్‌ అండ్‌ బోన్‌, బ్లాక్‌ హార్ట్‌, వైల్డ్‌ సిటీ లాంటి చిత్రాలు మరిస్సాకి మంచి పేరు తెచ్చాయి. మైండ్‌ ఓవర్‌ మర్డర్‌ అనే టీవీ సిరీస్‌ కూడా ఆమెకి మంచి గుర్తింపు తీసుకోచ్చింది.

కుటుంబ బాగోగులు చూసుకునే ఫ్యామిలీ మ్యాన్‌గా, బయట రౌడీల బెండు తీసే పవర్‌ఫుల్‌ మ్యాన్‌గా విజయ్‌ దేవకొండ ఈ సినిమాలో కనిపించనున్నారు. కూల్‌ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ కేయూ మోహనన్‌, సంగీతం: గోపీ సుందర్‌.