‘ఫ్యామిలీ స్టార్‌’ ప్రచార ప్రమోషన్లు షురూ…!

టాలీవుడ్‌ నటుడు విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ . ‘గీతగోవిందం’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాళ్‌ ఠాకూర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తుండగా.. ఎస్‌వీసీ బ్యానర్‌లో వస్తున్న 54వ చిత్రమిది. ఈ సినిమా ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌ షూరు చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేయగా మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది.’ఫ్యామిలీ స్టార్‌’ ట్రైలర్‌ కూడా మార్చి 28న విడుదల చేయనున్నట్లు తెలిపింది.

అయితే ఈ మూవీ విడుదలకు ఇంకా 8 రోజులే ఉండటంతో సినిమా విజయం సాధించాలని హోమం నిర్వహించింది శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌. ఎస్‌వీసీ బ్యానర్‌ అధినేత దిల్‌రాజ్‌తో పాటు శిరీష్‌ ఈ హోమం నిర్వహించగా.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హీరో విజయ్‌ దేవరకొండ వచ్చాడు. ఇక హోమంలో పాల్గొన్న విజయ్‌కు వేద పండితులు ఆశీర్వాదం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.