బిగ్ బాస్ 4: అభిజిత్ త‌ల్లేంటి కొట్టుకోండి అంటుంది.. అఖిల్‌కు స‌పోర్ట్ చేస్తుందా ఏమి?

బిగ్ బాస్ షో అంటే గొడ‌వ‌లు, కొట్లాట‌లు, వాగ్వాదాలు, ఎమోష‌న్స్, ఎఫైర్స్ అని క‌లిగలిసి ఉంటాయి. తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతున్న ఈ షో ప్ర‌స్తుతం సీజ‌న్ 4 జ‌రుపుకుంటుంది. చివ‌రి ద‌శకు చేరుకున్న ఈ షో ప్రేక్ష‌కుల‌లో చాలా ఆస‌క్తిని క‌లిగిస్తుంది. జ‌నాలు త‌గ్గుతున్న కొద్ది ఇండివిడ్యువ‌ల్ గేమ్ ఆడుతున్నారు ఇంటి స‌భ్యులు. ఫ్రెండ్స్ గా ఉన్న వారు శ‌త్రువులుగా మారుతున్నారు. ఫిజిక‌ల్ టాస్క్‌లు చేయ‌ని అభిజీత్ టైటిల్ కోసం రిస్క్ చేస్తున్నాడు. దాదాపు 70 రోజుల పాటు ప్ర‌పంచాన్ని మ‌రిచిపోయి నాలుగు గోడ‌ల మ‌ధ్య బ‌తుకున్న హౌజ్‌మేట్స్‌ని కాస్త ఉత్సాహ‌ప‌రిచేందుకు బిగ్ బాస్ వారి త‌ల్లుల‌ను హ‌జ్‌లోకి పంపారు. క‌రోనా వ‌ల‌న ప్ర‌త్యేక గ‌దిలో ఉంచి హౌజ్‌మేట్స్‌తో మాట్లాడించారు.

ప్ర‌తి సీజ‌న్ మాదిరిగానే ఈ సీజ‌న్‌కు కూడా కుటుంబ స‌భ్యులు ఇంట్లోకి ప్ర‌వేశించారు . ఫ్రీజ్‌లో ఉన్న స‌మ‌యంలో వారు ఇంట్లోకి రావ‌డంతో ఇంటి స‌భ్యుల‌ బాధ వ‌ర్ణ‌నాతీతంగా మారింది. అన్ ప్రీజ్ అన‌గానే ఒక్కొక్క‌రు వాళ్ళ అమ్మ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి మ‌న‌సుతో మాట్లాడారు. హారిక త‌ల్లి ముందు ఇంట్లోకి ప్ర‌వేశించ‌గా, ఆ స‌మ‌యంలో హారిక ఫ్రీజ్ మోడ్‌లో ఉంది. అన్ ఫ్రీజ్ అన‌డంతో ఉరుక్కుంటూ గ్లాస్ రూం ద‌గ్గ‌ర‌కు వెళ్ళి అమ్మ‌తో ప్రేమ‌గా మాట్లాడింది. ఇక అవినాష్ త‌ల్లి అయితే ఏకంగా డ్యాన్స్ చేసి అంద‌రిని ఉత్సాహ‌ప‌రిచింది. ఊరికే పెళ్ళి అని స‌తాయిస్తున్నాడు ఆంటి అని హారిక అంటే బ‌య‌ట‌కు వ‌చ్చాక చేస్తానులే అని చెప్పింది. అఖిల్ త‌ల్లి మాట్లాడుతూ హారిక లాంటి కూతురు కావాల‌ని దేత్త‌డి మీద ప్రేమ కురిపించింది.

అఖిల్ ఊరికే అలుగుతున్నాడు ఆంటీ అని సోహైల్ అన‌డంతో అఖిల్ త‌ల్లి అలుగుతున్నాడు లే అంటూ చ‌మత్క‌రించింది. ఇక అభి త‌ల్లితో మాట్లాడిన అవినాష్ .. ఇక్క‌డ ఎవ‌రు శ‌త్రువులు లేరు ఆంటి. గేమ్ వ‌ర‌కే అంతా కోపాలు. ఆ త‌ర్వాత అంద‌రం క‌లిసిపోతాం అని అన్నాడు. అయితే దానిపై రియాక్ట్ అయిన అభిజీత్ త‌ల్లి కొట్టుకోండి కావాలంటే మ‌జా వ‌స్తుంది అని ఎంక‌రేజ్ చేసింది. ఇక చివ‌ర‌కు అంద‌రు గ్రూపుగా క‌లిసి గంతులేశారు. మొత్తానికి ఈ రోజు స‌రాదాతో పాటు ఫుల్ ఎమోష‌న‌ల్‌గా ఉంటుంద‌ని అర్ద‌మ‌వుతుంది.