Extra Jabardasth : అదిరిపోయే ఫీట్.. రొమాన్స్‌తో రష్మీ-సుధీర్ మ‌రోసారి రచ్చ!

extra jabardasth 300th Episode Romance Rashmi Sudigali Sudheer

ఎక్స్ ట్రా జబర్దస్త్ షో అదిరిపోయే ఫీట్ అందుకుంది. అందరూ కలిసి 300వ ఎపిసోడ్‌ను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇంత వరకు ఎక్స్ ట్రా జబర్దస్త్, జబర్దస్త్ అంటూ వేర్వేరుగా ఉన్నవారంత అందరూ ఒకే చోటకు చేరారు. రష్మీ సుధీర్ అనసూయ యాంకర్ రవి ఇలా అందరూ ఒకే వేదికపై కనబడ్డారు. ఈ క్రమంలో సుధీర్ రష్మీ జోడి దుమ్ములేపేందుకు సిద్దమైనట్టు కనిపిస్తోంది. ఇద్దరూ కలిసి హాట్ హాట్ రొమాన్స్‌తో ప్రేక్షకులను హీటెక్కించేందుకు రంగం సిద్దమైంది.

extra jabardasth 300th Episode Romance Rashmi Sudigali Sudheer
extra jabardasth 300th Episode Romance Rashmi Sudigali Sudheer

ఇక ఈ వేడుకలో అనసూయ అందాలు అడిషనల్‌గా చేరబోతోన్నాయి. లేడీ గెటప్ ఆర్టిస్ట్‌లందరూ సుధీర్‌ను చుట్టి ముట్టి ఆట పట్టించినట్టు కనిపిస్తోంది. అందరూ కలిసి అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ సుధీర్‌కు చిరాకు పుట్టించేలా చేశారు. ఇక రాం ప్రసాద్, సుధీర్, గెటప్ శీనులు లేడీ గెటప్‌లో అదిరిపోయే స్కిట్‌లు వేసినట్టు కనిపిస్తోంది.

అయితే ఈ వేడుకల్లో యాంకర్ రవి కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు తమ ఫ్యామిలీలను కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. స్పెషల్ అట్రాక్షన్‌గా టిక్ టాక్ స్టార్ దుర్గారావు కూడా వచ్చాడు. మొత్తానికి సెలెబ్రేషన్స్ మాత్రం ఓ రేంజ్‌లో వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది. స్పెషల్ కేక్, స్పెషల్ పర్ఫామెన్స్‌లతో ఎక్స్ ట్రా ఎక్స్ ట్రా ఫన్ ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమో సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది.

Extra Jabardasth 300th Episode Promo - 16th October 2020 - Rashmi,Sudigali Sudheer,Anasuya Bharadwaj