రజినీకాంత్ ఎమోషనల్ అవడం వెనక కారణం తెలిస్తే మీరు ఎమోషనల్ అవుతారు.

రజనీకాంత్ – మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరంటే ఒకరికి గౌరవం.. అంతకన్నా ప్రేమ.. అభిమానం. రజనీకాంత్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి ఇళయరాజా సంగీతం అందించారు. ఇలా కూడా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే ఇళయరాజ కొత్తగా నిర్మించిన మ్యూజిక్ స్టూడియోని సూపర్ స్టార్ రజనీకాంత్ సందర్శించారు. ఆ సమయంలో ఒక ఆలయం లోపలికి ప్రవేశించినట్టుగా ఉందని రజనీ చెప్పడం తో ఇళయరాజా ఎంతో ఆనందానికి లోనయ్యారు.

కాగా ప్రఖ్యాత ప్రసాద్ స్టూడియోతో వివాదాన్ని పరిష్కరించుకున్న తరువాత మాస్ట్రో ఇళయరాజా తన సొంత మ్యూజిక్ స్టూడియోను రీసెంట్ గా నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఈ స్టూడియోని ప్రారంభించారు. కరోనావైరస్ భయం కారణంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఫిబ్రవరి 15 న ఇళయరాజా మ్యూజిక్ స్టూడియోని సందర్శించడం కోలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.

కాగా ఇళయరాజా స్టూడియోకి వెళ్లేముందు ఆయన నివాసాన్ని కూడా రజనీ సందర్శించారు. ఇక రజనీకాంత్ స్టూడియోలో ఇళయరాజా తో ఉన్న ఫోటోలు ప్రస్తుతం అభిమానుల్లో వైరల్ గా మారాయి. ఇక రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. మార్చిలో తిరిగి ప్రారంభిస్తారట. అయితే అన్నాత్తే షెడ్యూల్ కు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. రజనీకాంత్ తన పార్ట్ మొత్తం ఒకే షెడ్యూల్ లో పూర్తి చేస్తారని అంటున్నారు. ఈ సినిమాకి మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార, కీర్తి సురేష్, ఖుష్బూ, మీనా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.