ఈ వయస్సులో కూడా రోజుకు 14గంటలు పని చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన బిగ్ బీ..!

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వందలకు పైగా సినిమాలలో నటించిన అమితాబచ్చన్ వయసు మీద పడినా కూడా విరామం లేకుండా పనిచేస్తూ బిజీగా ఉన్నారు. అమితాబచ్చన్ ఫొటోస్ సినిమాలలో నటిస్తూనే కౌన్ బనేగా కరోడ్ పతి అనే టీవీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. రెండూ సార్లు కరోనా బారిన పడ్డ అమితాబ్ కరోనా నుండి కోలుకొని రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ రోజుకి 14 గంటలసేపు కష్టపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అమితాబచ్చన్ వెల్లడించాడు.

ప్రస్తుతం పవన్ బనేగా కరోడ్పతి 14 వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ లో తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న బ్రిజ్ కిషోర్ తన రోజువారీ జీవితంలో ఉన్న ఉద్యోగ జీవితం గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ కూడా తన షూటింగ్ టైమింగ్ తో పాటు ప్రతిరోజు తన జీవితంలో ఉండే టైమ్ టేబుల్ గురించి వివరించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేచింది మొదలు రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా పనిచేస్తున్నట్టు అమితాబ్ చెప్పారు.ఇలా ప్రతిరోజూ రోజుకు 14 గంటల వరకూ తాను పనిచేస్తున్నట్టు అమితాబ్ వెల్లడించారు. ప్రస్తుతం కాలంలో ఉన్న స్టార్ హీరోలు ఒకరోజుకి 8 గంటలు పని చేస్తేనే కష్టంగా ఫీల్ అవుతుంటారు.

కానీ 80 ఏళ్ల వయసులో అమితాబ్ రోజుకి 14 గంటలు పని చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా ఎక్కువ సమయం పని చేయటం వల్ల తనకి రెట్టింపు బలం వస్తుందని బిగ్ బి చెప్పుకొచ్చారు. 80 ఏళ్ల వయసులో రెండుసార్లు కరోనా బారిన పడిన కూడా కరోనా నుండి కోలుకున్న వెంటనే ఇలా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇటీవల విడుదలయిన బ్రహ్మాస్త్రం సినిమాలో కూడా కీలకపాత్రలో నటించాడు. ప్రస్తుతం అమితాబ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.