Kalyan : సినీ పరిశ్రమలో వారసుల ఎంట్రీ మాములే. హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, సహనటుల పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మరో స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు . ఆయన ఎవరో కాదు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రొడ్యూసర్ దానయ్య కొడుకు దాసరి కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు . వారసుడి ఎంట్రీ బాధ్యతలను యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించారు దానయ్య యంగ్ హీరో తేజ సజ్జను హీరోగా పరిచయం చేసి, తేజతోనే హను-మాన్ అనే సూపర్ హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను కళ్యాణ్ తొలి చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఖరారు చేసారు.
ఇక కళ్యాణ్ పరిచయాన్ని రాజమౌళి, రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లతో లాంచ్ చేయించారు. అయితే ప్రశాంత్ వర్మ నుంచి అసలు ఊహించని రేంజ్ సర్ ప్రైజ్ ఇచ్చాడని చెప్పాలి. మన ఇండియన్ సినిమా దగ్గర అతి తక్కువగా టచ్ చేసినటువంటి సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో అది కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రశాంత్ నుంచి మరో సినిమా వస్తుండడం ఆసక్తిగా ఉందని చెప్పాలి.
ముఖ్యంగా కళ్యాణ్ ని “అధీరా” ఇంట్రడ్యూస్ చేస్తూ కట్ చేసిన ఈ గ్లింప్స్ తో అయితే మైండ్ బ్లాక్ చేసాడని చెప్పాలి. ఒక సరికొత్త సూపర్ హీరోని పరిచయం చేస్తున్నట్టుగా కళ్యాణ్ రోల్ ని నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేసాడు. అలాగే దీనితో మన తెలుగు సినిమా నుంచే కాకుండా ఇండియన్ సినిమా నుంచి కూడా ఒక సరైన సూపర్ హీరో వస్తున్నాడని గర్వంగా చెప్పుకునేలా ఉంది. ఇక ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.