Balayya UnStoppable: బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా విజయోత్సవంలో ఉన్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఎంతో ఆనందం ఎనర్జీతో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షోలో పాల్గొంటూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతారు. ఇప్పటికే ఈ షో ద్వారా బ్రహ్మానందం డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఎంతో సందడి చేసిన బాలకృష్ణ ఆ తర్వాత అఖండ చిత్ర బృందంతో ఎంతో సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమంలో బాలకృష్ణ రాజమౌళి ఆర్ఆర్ఆర్ టీమ్ తో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సందడి చేయనున్నట్లు తాజాగా ప్రోమో పోస్టర్ల ద్వారా తెలుస్తోంది. ఈ పోస్టర్లలో బాలకృష్ణ మరింత రెట్టింపు ఉత్సాహంతో పాల్గొన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రాజమౌళి బాలకృష్ణ టాక్ షో లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
గత కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమౌళి ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా బాలకృష్ణ ఒక ఆటంబాంబ్ అంటూ అతని పై ప్రశంసలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే. మరి రాజమౌళి ఈ టాక్ షోలో ఆ ఆటంబాంబ్ తో ఎలా సందడి చేయబోతున్నారనే విషయాల గురించి మరి కొద్ది రోజులలో తెలియనుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.