Mega star : ఆర్ఆర్ఆర్ టీంకు మెగా స్టార్ పార్టీ… నాటు నాటు పార్టీ కి సిద్ధమైన తారక్, చెర్రీ…!

Mega Star: తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకుడు రాజమౌళి ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం ఈ సినిమా. ఎన్టీఆర్ రామ్ చరణ్ ల నట విశ్వరూపం తో దూసుకుపోతోంది సినిమా. విడుదల అయిన రోజు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ టీం సంబరాలు చేసుకుంటున్నారు. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గొప్ప విజయాన్ని అందుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందానికి ఒక పార్టీ ఇవ్వాలి అనుకుంటున్నాడట.

మెగా కాంపౌండ్ లో జరుగుతున్న ఈ పార్టీకి ఆర్ ఆర్ ఆర్ చిత్రపురి లో మొత్తాన్ని ఆహ్వానించినట్లు సమాచారం. వీరితో పాటు నందమూరి ఫ్యామిలీ కు సంబంధించిన కొందరిని కూడా ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ పార్టీ నాట్ అఫిషియల్ అని సమాచారం. బయట మీడియా వారెవరికీ ఎంట్రీ లేదని తెలుస్తోంది. అలాగే ఈ పార్టీకి బాలీవుడ్ హీరోయిన్ ఆలియా బట్ కి కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం. అలియా కూడా పార్టీ మిస్ అవ్వకుడదనే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే మెగా కాంపౌండ్ లో జరగబోతున్న ఈ పార్టీకి సంబంధించి ఇటువంటి సమాచారం ఇంకా కచ్చితంగా తెలియట్లేదు. ఎవరెవరికి ఆహ్వానం పలికారు ఎవరు వస్తున్నారు అన్న సంగతి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ ఇచ్చిన పార్టీ గురించి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉన్నది అందుకని కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.