Danayya : అధీరగా రాబోతున్న డివివి దానయ్య తనయుడు….!

Danayya: ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రొడ్యూసర్ దానయ్య కొడుకు కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. సినీ పరిశ్రమలో వారసుల ఎంట్రీ మాములే. హీరోలు, ప్రొడ్యూసర్లు,డైరెక్టర్లు, సహనటుల పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇటీవలే మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ తనయుడు మొదటి చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. క ఎన్టీఆర్ బావ మరిది కూడా తన మొదటి చిత్రాన్ని షురూ చేసారు. ఇక మెగా ఫ్యామిలీ గురించి చెప్పనక్కరలేదు. అందరు దాదాపు హీరోలుగా వచ్చేసారు. ఇక ఈ మధ్యనే ప్రముఖ పారిశ్రామిక , రాజకీయ వేత్త అయిన గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరిటీ ని వారహి వారు గ్రాండ్ గా పరిచయం చేసారు.

అయితే వారసుడి ఎంట్రీ బాధ్యతలను యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు టాక్ నడుస్తోంది. యంగ్ హీరో తేజ సజ్జను హీరోగా పరిచయం చేసి, తేజతోనే హను-మాన్‌ అనే సూపర్ హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను కళ్యాణ్ తొలి చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కళ్యాణ్ హీరోగా పరిచయం అవుతూ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు‘అధీర‌’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ప్రాజెక్ట్ ‘అధీర‌’ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రొడ్యూసర్ దానయ్య కు కథ మొత్తం చెప్పినట్లు, దానయ్య ఆ కథలో సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసినట్లు సమాచారం. ఈ వారంలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట.