రెండు కారణాల వల్ల సుడిగాలి సుధీర్ ను తీసేసారా.. అసలు నిజం బయటపెట్టిన చలాకి చంటి!

బుల్లితెరలో జబర్దస్త్ కామెడీ షోకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ షో ద్వారా క్రేజ్ సంపాదించుకుని సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్స్ వెండితెరకు కూడా పరిచయమయ్యారు. ఎందరో టాలెంట్ ఉన్న కమీడియన్లకు జబర్దస్త్ ఒక అద్భుతమైన ప్లాట్ ఫారంగా మారింది. సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, తదితరులు జబర్దస్త్ నుండి క్రేజ్ సంపాదించి ఇప్పుడు నటులుగా కూడా సెటిల్ అయ్యారు.

కానీ ఇప్పుడు జబర్దస్త్ అంటే ఆ షో మాకేమి ఇవ్వలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ నుండి చాలా మంది బయటకు వెళ్లిపోయారు. వాళ్లంతా కూడా మల్లెమాలసంస్థను తెగ తిడుతున్న సందర్భాలు కూడా మనం చూశాం. కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్లు ఇంకా మర్చిపోకముందే హైపర్‌ ఆది, సుడిగాలి సుధీర్‌ లాంటి స్టార్ కమెడియన్లు పరోక్షంగా జబర్దస్త్ పై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే.

ఈ మధ్యనే షో నుండి బయటకు వెళ్లిపోయిన అనసూయ సైతం.. రెండేళ్లుగా జబర్దస్త్ నుండి బయటకి వచ్చేయాలని ప్రయత్నిస్తున్నట్టు అలాగే అక్కడి బాడీ షేమింగ్ కామెంట్లు, వెకిలి చేష్టలు, డబుల్ మీనింగ్ డైలాగులు భరించలేకపోయేదాన్ని అని ఆమె కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా చలాకి చంటి కూడా ఇప్పుడు తనకున్న పాపులారిటీ జబర్దస్త్‌ వల్ల వచ్చింది కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. జబర్దస్త్‌ ఆర్టిస్టులకి సినిమా అవకాశాలు పెద్దగా రావని, సినిమాల విషయంలో జబర్దస్త్ ఆర్టిస్టులు మోసపోతుంటారు. ఇంకా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఉన్న పాత్ర నిడివి సెట్స్‌పైకి వెళ్ళాక ఉండదని అంటుంటారు అది నిజమేనా? అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు.. చలాకీ చంటి బదులిస్తూ.. అతనికి జబర్దస్త్ వల్ల పేరు రాలేదనీ చెప్పుకుంటూ వచ్చాడు.

చలాకీ చంటికీ ఓ టీవీ ఇంటర్వ్యూలో భాగంగా ఓ ప్రశ్న ఎదురైంది. అయితే గత కొంతకాలంగా సుధీర్ జబర్దస్త్ లో కనిపించడం లేదు. షో నుంచి ఆయనను తీసేసారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చలాకీ చంటి ఈ వార్తలపై రియాక్ట్ అయ్యారు. ఈ మధ్యనే బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయి వచ్చేసిన చలాకీ చంటి సుధీర్ విషయం గురించి మాట్లాడుతూ జబర్దస్త్ వారు సుధీర్ ను చాలా రకాలుగా ప్రోత్సహించారు. అతను కారు, ఇల్లు కొనుక్కోవడానికి, ఫారిన్ వెళ్లడానికి కూడా సహాయపడ్డారు. అలాంటిది వాళ్లు సుధీర్ ని తీసేసినట్లు నేను విన్నాను. నాకు కూడా చాలా బాధ అనిపించింది.

కానీ కంపెనీకి సుధీర్ కి మధ్య ఏం జరిగిందో తనకు తెలియదు అని చెప్పాడు. ఆ సమయంలో తాను అక్కడ లేనని చెప్పాడు. అయితే రెండు కారణాల వల్ల సుధీర్ ని తీసేసారని కొందరు అంటున్నారు. కానీ అవేంటో కూడా తనకు కూడా తెలియదనీ చెప్పుకుంటూ వచ్చాడు. కళ్ళతో చూస్తే అతను చెప్పే వాడిని కానీ ఎవరో చెప్పిన దానిని నమ్మి చెప్పే రకం కాదు అని చెప్పాడు. కానీ ఇటు సుదీర్ ని కానీ అటు కంపెనీ వారిని తప్పు పట్టలేము. ఎవరిష్టం వాళ్లది అని చెప్పుకొచ్చారు చలాకి చంటి.