చుట్ట తాగడం ఆరోగ్యానికి మంచిది…. షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య బాబు!

సాధారణంగా ఏదైనా సినిమా ప్రసారమవుతున్న సమయంలోను లేదా సీరియల్స్ లోను బయట కూడా పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుంది.ఇలా పొగ తాగటం వల్ల ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కి గురి అవ్వడమే కాకుండా క్యాన్సర్ బారిన పడటానికి కూడా అవకాశం ఉంటుందని అందుకే పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని రాసిపెట్టి ఉంటుంది. కానీ బాలయ్య బాబు మాత్రం చుట్ట తాగడం ఆరోగ్యానికి మంచిది అంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలకృష్ణ తాజాగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబు ఎక్కువగా చుట్టూ తాగుతూ ఉండే సన్నివేశాలలో నటించారని ఈ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అవ్వబోతాయి అంటూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో తెలియజేశారు. అయితే చుట్ట తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని బాలయ్య ఈ సందర్భంగా తెలిపారు.సిగరెట్ తాగడం వల్ల ఆ పొగ ఊపిరితిత్తులలోకి వెళ్లి చాలా ఇన్ఫెక్షన్ అవుతుంది కానీ చుట్ట తాగటం వల్ల ఆ పొగ నోటి నుంచి బయటికి వస్తుందని ఈ క్రమంలోని గొంతులో ఉన్నటువంటి కఫం మొత్తం కరిగిపోతుందని తెలిపారు.

ఇలా గొంతులో ఉన్నటువంటి కఫం కరిగిపోవడంతో మాట చాలా స్పష్టంగా గంభీరంగా వస్తుందని,ముఖ్యంగా సినిమాలలో భారీ డైలాగ్స్ చెప్పడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అంటూ బాలయ్య చుట్ట తాగడం వల్ల ప్రయోజనాలను తెలియజేశారు.ఇలా బాలకృష్ణ చుట్టా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పడంతో బాలయ్య భారీ డైలాగ్స్ చెప్పడం వెనుక ఉన్న రహస్యం చుట్టలేనా,అందుకే బాలయ్య భారీ డైలాగులను కూడా చాలా గంభీరంగా అవలీలగా చెప్పేస్తారా అంటూ నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.