బంగారం కొనిపెట్టిన డాక్టర్ బాబు.. ఎంత కొనిపెట్టాడో తెలిస్తే షాక్!

Nirupam Paritala : పరిటాల నిరుపమ్ ఈ పేరు చెబితే చాలా మందికి తెలియకపోయినప్పటికీ డాక్టర్ బాబు అంటే చాలు ప్రతి ఒక్కరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు.కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పరిటాల నిరుపమ్అలియాస్ డాక్టర్ బాబు రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ కుపరిటాల నిరుపమ్ దూరమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నిత్యం అభిమానులను సందడి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ బాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అక్షయ తృతీయ స్పెషల్ వీడియోని షేర్ చేశారు.

ఈ సందర్భంగా తన భార్య మంజులతో కలిసి డాక్టర్ బాబు అక్షయ తృతీయ సందర్భంగా తన భార్యకు బంగారం కొన్ని పెట్టారు. ఈ క్రమంలోనే ఈ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. అక్షయ తృతీయ అంటేనే పెద్దఎత్తున బంగారం కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలోనే బంగారం దుకాణాలన్నీ కస్టమర్లతో హడావిడిగా ఉంటాయి. అక్షయ తృతీయ పండుగ సందర్భంగా డాక్టర్ బాబు ఆయన భార్య మంజుల హైదరాబాద్ సిఎంఆర్ జువెలరీ లో ఏకంగా 136 గ్రాముల బంగార హారాన్ని తన భార్యకు కానుకగా కొనిపెట్టారు.

 

ఇక ఈ వీడియోని అక్షయ తృతీయకి బడ్జెట్లో బంగారం అంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ఇక ఈ వీడియో షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే విపరీతమైన వ్యూస్ సంపాదించుకుంది. మరెందు కాలస్యం ఆ వీడియో పై మీరు ఓ లుక్కేయండి. ఇకపోతే మంజుల,డాక్టర్ బాబు ఇద్దరూ కూడా టీవీ నటీనటులు అనే విషయం మనకు తెలిసిందే. ఈమె కూడా పలు సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం వీరిద్దరూ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీరికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.