బిగ్ అప్డేట్ : “భోళా శంకర్” నుంచి డబుల్ మ్యూజికల్ బ్లాస్ట్.!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వస్తున్న పలు మెగా రీమేక్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చాలా కాలం తర్వాత సోలో హీరోగా చేస్తున్న సినిమా “భోళా శంకర్” కూడా ఒకటి. మరి వాల్తేరు వీరయ్య హిట్ అనంతరం మాస్ డ్రామాగా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగష్టు రిలీజ్ కి సిద్ధం అవుతుండగా ఇపుడు మేకర్స్ ప్లానింగ్ ప్రకారం ఒకో అప్డేట్ ని అయితే స్టార్ట్ చేస్తున్నారు.

ఇక మొన్ననే సినిమా నుంచి మ్యూజికల్ మేనియా ని అనౌన్స్ చేయగా ఇప్పుడు అయితే డబుల్ మ్యూజికల్ బ్లాస్ట్ ని అనౌన్స్ చేసేసారు. కాగా భోళా శంకర్ నుంచి అయితే మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని ఈ జూన్ 4న ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ చేస్తుండగా మరి దీని నుంచి ప్రోమో ని అయితే మేకర్స్ ఈ జూన్ 2న అయ్యితే రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

మొత్తానికి అయితే మళ్ళీ మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ బిగ్ ట్రీట్ వస్తుందని చెప్పాలి. మెయిన్ గా మెగాస్టార్ తన మార్క్ డాన్స్ ని బీట్స్ ని చూడాలి అని ఎదురు చూస్తున్నారు. కాగా ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా..

తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది అలాగే కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ ఆగష్టు 11న రిలీస్ కాబోతుంది.