లేటెస్ట్ : అప్పుడే ఉస్తాద్ “డబుల్ ఇస్మార్ట్” కి రిలీజ్ డేట్ ఫిక్స్.!

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న పలు క్రేజీయెస్ట్ కాంబినేషన్స్ లో ఉస్తాద్ రామ్ పోతినేని మరియు మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ కూడా ఒకటి. మరి ఈ ఇద్దరు కూడా భారీ ప్లాప్ లలో ఉన్నపుడు కలిసి చేసిన చిత్రం “ఇస్మార్ట్ శంకర్” కోసం తెలిసిందే. గత 2018లో చేసిన ఈ చిత్రం భారీ హిట్ అయ్యి రికార్డు లాభాలు అందించింది.

అయితే ఈ సినిమాకి మేకర్స్ అప్పట్లోనే పార్ట్ 2 ఉన్నట్టుగా  ఇవ్వగా ఈ చిత్రం ని ఇప్పుడు చిత్ర యూనిట్ బిగ్గెస్ట్ అప్డేట్ తో అనౌన్స్ చేయగా దీనితో పాటుగా మరో క్రేజీ అప్డేట్ ని ఇప్పుడు మేకర్స్ ఇచ్చేసారు. అదే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.

అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2024లో మార్చ్ 8న గ్రాండ్ గా అందులోని పాన్ ఇండియా భాషలు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. కాగా ఈ మాసివ్ అప్డేట్ ఇప్పుడు మేకర్స్ ఇచ్చేసారు. దీనితో ఈ చిత్రం అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు మాత్రం ఇప్పుడు దీనితో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ అయితే హిందీలో అప్పట్లో యూట్యూబ్ లో రిలీజ్ చేయగా ఆల్ టైం రికార్డు రెస్పాన్స్ కొల్లగొట్టింది. మరి ఈ సినిమాకి హిందీలో ఎలాంటి రెస్పాన్స్ కూడా దక్కుతుందో అనేది చూడాలి. అలాగే ఈ చిత్రానికి మళ్ళీ మణిశర్మ ని సంగీతం కి తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే పోస్టర్ లో ఏ ఇతర టెక్నీషియన్ పేరుని అయితే పెట్టలేదు.