Bigg boss 4: ఈ వారం డబుల్ ఎలిమినేషన్? నాగార్జున ఫేవరేట్ కంటెస్టెంట్లు ఔట్?

double elimination in bigg boss house this week

బిగ్ బాస్.. ఇది అసలైన మూమెంట్ అంటే. ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ షోలో హీట్ పెరుగుతోంది. వారం వారం ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతున్నా కొద్దీ.. షో టఫ్ అయిపోతోంది. కంటెస్టెంట్లలోనూ పోటీ పెరుగుతోంది. ప్రస్తుతానికి బిగ్ బాస్ హౌస్ లో 8 మంది ఉన్నారు. వారిలో ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు అభిజీత్, హారిక, లాస్య, అరియానా, మోనాల్, సోహెల్ నామినేషన్ లో ఉన్నారు.

double elimination in bigg boss house this week
double elimination in bigg boss house this week

అయితే.. ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటికి వెళ్తారు? అనేదానిపై చాలా సందేహాలు ఉన్నాయి. నామినేట్ అయిన వాళ్లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అంటే అభిజీత్, హారిక, సోహెల్, అరియానా. వీళ్లు నలుగురు నో డౌట్ లేకుండా సేవ్ అవుతారు. కానీ.. మిగిలిన ఇద్దరు లాస్య, మోనాల్.. వీళ్లిద్దరి విషయంలోనే కొంచెం డౌట్ కొడుతోంది ప్రేక్షకులకు.

ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందట. ఎందుకంటే.. కుమార్ సాయిని కానీ.. నోయల్ ను కానీ మళ్లీ ఇంట్లోకి పంపించేందుకు ఓవైపు సన్నాహాలు జరుగుతున్నాయి. వాళ్లిద్దరిలో ఒకరు బిగ్ బాస్ హౌస్ లో ఈ వారమే ఎంట్రీ ఇవ్వనున్నారట. అందుకని.. ఈ వారం ఇద్దరిని ఇంటి నుంచి బయటికి పంపించేందుకు బిగ్ బాస్ ప్లాన్ వేశాడట.

ఒకవేళ.. ఇద్దరు ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సి వస్తే.. నో డౌట్.. నాగార్జునకు ఇష్టమైన కంటెస్టెంట్లు లాస్య, మోనాల్ బయటికి వెళ్లిపోతారు.. అని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ లేకున్నా… సింగిల్ ఉన్నా కూడా ఇద్దరిలో ఒకరు గ్యారెంటీగా ఔట్… అంటూ కామెంట్లు చేస్తున్నారు. చూద్దాం… ఏం జరుగుతుందో ఈ వారం?