RC15 నుంచి డబుల్ బ్లాస్ట్.?

ప్రస్తుతం మెగా ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తో చేస్తున్న సినిమా అని చెప్పాలి. ప్రస్తుతానికి RC15 గా పరిగణలో ఉన్న ఈ భారీ సినిమా శంకర్ మార్క్ లో అయితే భారీ హంగులతో తెరకెక్కుతుంది.

మరి ఈ సినిమా ఇప్పటికే 70 శాతం మేర షూటింగ్ ని కంప్లీట్ చేసుకోగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఆల్రెడీ భారీ అప్డేట్స్ చరణ్ బర్త్ డే కానుకగా రానున్నాయని టాక్ వచ్చింది. అయితే ఈ మార్చ్ 27న చరణ్ బర్త్ డే సందర్భంగా మొదటగా సినిమా టైటిల్ ని అయితే అనౌన్స్ చేస్తారని దిల్ రాజు కన్ఫర్మ్ చేయగా.

ఇపుడు అదే రోజుకి మరి బిగ్ ట్రీట్ కూడా ఉంటుంది అని సినీ వర్గాలు చెప్తున్నాయి. శంకర్ అయితే టైటిల్ తో పాటుగా ఓ వీడియో కూడా చరణ్ పై రిలీజ్ చేయనున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ఈ భారీ సినిమా నుంచి రెండు బ్లాస్ట్ లు దాదాపు కన్ఫర్మ్ అని చెప్పుకోవాలి.

కాగా ఈ భారీ సినిమాలో బాలీవుడ్ గ్లామ్ క్వీన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అంజలి కూడా మరో హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.