ప్రస్తుతం జబర్దస్త్ అంటే హైపర్ ఆది.. హైపర్ ఆది అంటే జబర్దస్త్. హైపర్ ఆదికి జబర్దస్త్ లో ఉన్న క్రేజే అటువంటిది. ఆయన స్కిట్ కోసమే చాలామంది జబర్దస్త్ చూస్తారంటే అతిశయోక్తి కాదు. జబర్దస్త్ లో హైపర్ ఆది, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్. వీళ్ల స్కిట్లతోనే జబర్దస్త్ అంత ఫేమస్.
ఇక.. హైపర్ ఆది మాత్రం తన ప్రతి స్కిట్ కు ఒక అమ్మాయిని తీసుకొచ్చి తన భార్య క్యారెక్టర్ ఇచ్చి బాగానే వినోదాన్ని పంచుతున్నాడు. ఇక.. స్కిట్ లో హైపర్ ఆది పంచులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన టీంలోని మిగితా సభ్యులు కూడా ఆయన వేసే పంచులు తట్టుకోలేకపోతున్నారు.
అందులోనూ తన టీం సభ్యులు బయట ఏదైనా చేసి ఇరుక్కుంటే దాన్నే పట్టుకొని స్కిట్ లో లాగుతుంటాడు హైపర్ ఆది. ఆ మధ్య దొరబాబు ఓ బ్రోతల్ కేసులో అడ్డంగా దొరికిపోయాడు కదా. దాని వాస్తవాల గురించి తెలియదు కానీ… ఆ సంఘటనను మాత్రం హైపర్ ఆది తన కామెడీ కోసం విపరీతంగా వాడేసుకుంటున్నాడు.
దొరబాబు తన స్కిట్ లోకి ఎంట్రీ ఇస్తే చాలు.. ఆ ఘటనను గుర్తు చేయడం, ఫన్ క్రియేట్ చేయడం… ఇక లాభం లేదనుకున్నదో ఏమో.. దొరబాబు భార్యే ఏకంగా రంగంలోకి దిగింది. ఏకంగా స్కిట్ మధ్యలోకి వచ్చింది… దొరబాబుపై ఆది ఏదో పంచ్ వేయబోతుంటే… దొరబాబును దంచింది. తర్వాత అది జరగడమేమో కానీ.. నువ్వు మాత్రం దాన్న పెంట పెంట చేస్తున్నావంటూ ఆదిని చితక్కొట్టింది దొరబాబు భార్య.
అది స్కిట్ లో భాగమే అయినప్పటికీ దొరబాబు భార్య కావాలనే హైపర్ ఆదిని చితకబాదినట్టుగా కనిపిస్తుంది ఆ స్కీట్ లో. అది అసలు మ్యాటర్. మీరు కూడా ఆ స్కిట్ ను చూడండి..