అమ్మతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్!

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. అయితే కొంతమంది నటీమణులు వారి చిన్నప్పటి ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఫోటో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. తన తల్లితో కలిసి కేక్ కట్ చేస్తూ ఉన్నటువంటి ఓ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది అయితే ఇక్కడ కేక్ కట్ చేస్తున్న ఆ చిన్నారి ప్రస్తుతం పాన్ ఇండియా సీనియర్ స్టార్ హీరోయిన్. ఈమె ఎవరో మరి గుర్తుపట్టండి.

ఇలా కేక్ కట్ చేస్తూ ఎంతో ముద్దుగా ఉన్నటువంటి ఈ చిన్నారి ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోకి కోడలిగాను మరొక స్టార్ హీరోకి భార్యగాను గుర్తింపు పొందారు. ఇక ఈమె ప్రపంచం మెచ్చిన సుందరి, ముఖ్యంగా ఈమె కళ్ళకు ఎంతోమంది అభిమానులు. మరి ఇప్పుడైనా గుర్తొచ్చిందా ఈమె ఎవరో అవునండి మీరు అన్నది కరెక్టే ఈ ఫోటోలో తల్లితో కలిసి కేక్ కట్ చేస్తున్న చిన్నారి మరెవరో కాదు మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్ బచ్చన్ ఫ్యామిలీ కోడలు ఐశ్వర్యరాయ్.

ఐశ్వర్యరాయ్ తన తల్లితో కలిసి షేర్ చేస్తున్నటువంటి ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్నప్పటినుంచి ఎంతో అందంగా ఉన్నటువంటి ఐశ్వర్యరాయ్ తనతో పాటే అందం కూడా పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె ఐదు పదుల వయసులో చేరుకున్నప్పటికీ ఏమాత్రం తగ్గకుండా అదే అందంతో అభిమానులను సందడి చేస్తున్నారు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.