శివ పార్వతి తెలుగు చలనచిత్ర నటి. తెలుగు సినిమాలలో తల్లిగా, అత్తగా, వదిన పాత్రలలో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ సినిమాలలో కూడా నటించడం జరిగింది. 1975 నుండి రంగస్థలంలో నటించిన ప్రారంభించింది. 1981 లో సప్తపది సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.
ఇక వరుస అవకాశాలతో సినీ రంగంలోనే కాక.. బుల్లితెరలో ప్రసారమయ్యే పలు సీరియల్ లో నటించింది. తెలుగులో దాదాపుగా 200 కు పైగా చిత్రాలలో నటించింది. తెలుగు ప్రేక్షకుల మనసులలో తన నటన ద్వారా ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. తెలుగులోనే కాక తమిళం, కన్నడ భాషలలో అవకాశాలు రావడంతో అక్కడ కూడా తన నటనకు గుర్తింపు తెచ్చుకుంది.
ఇలా సినిమా రంగంలో రాణిస్తున్న శివపార్వతి గతంలో ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో తనను సాయిబాబాను ఎక్కువగా ఆరాధిస్తారు కదా అనే ప్రశ్న అడగడం జరిగింది. అందుకు తాను తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఇంటర్వ్యూలో పంచుకోవడం జరిగింది.
తనకు చిన్నప్పుడు అంతలా దైవభక్తి ఉండేది కాదట.. గతంలో ఒకసారి తన కుమారుడికి అనారోగ్యం పాడవడం జరిగిందని, దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు వేచించిన ఉపయోగం లేకుండా పోయిందని తెలిపింది. చివరకు ఖర్చులు ఎక్కువ అవుతుండడంతో చేసేదేమీ లేక తన కుమారుడి వెన్నెముకలో నీరు తీయించేద్దాం అనుకున్నారట.
ఇంతలో తన సన్నిహితులు అలా చేస్తే నూతన్ ప్రసాద్ లా ఎప్పటికీ వీల్ చైర్ కే పరిమితం చేయాలనుకుంటున్నావా అంటూ.. షిరిడి వెళ్లి అక్కడ రొట్టెలు పంచి పెడితే శుభం జరుగుతుందని వెంటనే శిరిడీ వెళ్ళమని సలహా ఇచ్చారని తెలిపింది. ఇక చివరి ప్రయత్నం గా శిరిడీ వెళ్లి వచ్చాక ఒక వారం రోజులకే ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపింది.
నాకు అప్పుడు అర్థమయింది సాయిబాబా మహిమ ఎలాంటిదో.. కుల మతాల భేదం లేకుండా, ఉన్నవారు లేనివారు అని చూడకుండా అందరికీ ఒకటే బోధించడం వల్ల ఆయన సాయిబాబా అయ్యాడు. అప్పటి నుంచి తాను కూడా సేవా భావంతో జీవితం కొనసాగిస్తున్నానని తెలిపింది. దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు. మనం చేసే మంచి పనులలో దేవుడు ఉంటాడని తెలపడం జరిగింది. ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉండి కుటుంబ బాధ్యతను చూసుకుంటుంది.