కొత్త సంవత్సరం సందర్భంగా సాయిబాబా గుళ్లో పూజలు.. దటీజ్ సాయి పల్లవి!

ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి పల్లవి తర్వాత తన టాలెంట్ తో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది.అద్బుతమైన నటనతో, అత్యద్భుతమైన డాన్సులతో ఆమె మెస్మరైజ్‌ చేస్తుంది. ఆడియెన్స్ ని కట్టిపడేస్తుంది. అంతే నిజాయితీగా ఉంటూ ఆకట్టుకుంటుంది. అందుకే ఆమెకి విశేషమైన ఫాలోయింగ్‌ ఉంటుంది. ఫ్యాన్‌ బేస్‌ ఉంటుంది. ఇటీవలే అమరన్‌ సినిమాతో విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ఇండియా వైడ్‌గా దుమ్ములేపింది.

భారీ వసూళ్లని రాబట్టింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్స్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో సాయిపల్లవి చేసిన మ్యాజిక్‌ అంతా ఇంతా కాదు. ఆమె వల్లనే సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందని అంటుంటారు. అంతటి సక్సెస్‌ని అందుకున్నా సాయిపల్లవి ఏమాత్రం గర్వం చూపించదు. సక్సెస్ తో తనకి ఏమీ సంబంధం లేనట్లు ఒక సాధారణ ఆడపిల్లలా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ చలాకీగా ఉంటుంది. కొత్త ఏడాది సంద‌ర్భంగా అంద‌రూ న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌లో మునిగితేలుతుంటే సాయి ప‌ల్ల‌వి మాత్రం ఆధ్యాత్మికం వైపు వెళ్లింది.

కొత్త సంవ‌త్స‌రం కానుక‌గా.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబాను ద‌ర్శించుకుంది సాయి ప‌ల్ల‌వి. కుటుంబంతో క‌లిసి పుట్ట‌ప‌ర్తికి వెళ్లిన సాయిప‌ల్ల‌వి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంత‌రం బాబా నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మికతను చాటుకుంది. ఈ సందర్భంగా పట్టుచీరలో సంప్రదాయంగా మెరిసి ఆకట్టుకుంది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. సాయిపల్లవికి దేవుడిపై నమ్మకం ఎక్కువ. అందుకే తరచూ తీర్థయాత్రలు చేస్తుంటుంది. ప్రముఖ దేవాలయాలను సందర్శించుకుంటుంది.

ఇటీవలే వారణాసి వెళ్లి అక్కడ కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణదేవీ అమ్మవారిని దర్శించుకుంది సాయి పల్లవి. ప్రత్యేకంగా పూజలు కూడా చేసింది. కాగా సాయిపల్లవి శ్రీ సత్యసాయిబాబా భక్తురాలు. ప్రతి ఏడాది కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ఆమె పుట్టపర్తి వచ్చి.. బాబా సమాధిని దర్శించుకుంటారు. అంతేకాదు షూటింగుల నుంచి విరామం దొరికినప్పుడల్లా ప్రశాంతి నిలయానికి వస్తుంటుందీ అందాల తార.

Actress Sai Pallavi Visuals at Puttaparthi Sai Baba Temple | New Year Celebrations 2024