ఒకప్పటి హీరోయిన్ కి  సాయిబాబా ప్రత్యక్షమై అలా చెప్పారంట

టాలీవుడ్ నటి తులసి గురించి పరిచయం అక్కర్లేదు. ‘శంకరాభరణం’, ఇంకా కొన్ని సినిమాల్లో బాలనటిగా మెప్పించి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా కొన్నాళ్ళు అలరించారు. హీరోయిన్ గా స్టార్ హోదా అందుకోకపోయినా మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ తో బిజీ గా ఉన్న తులసి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఒక సినిమా ప్రమోషన్ లో తులసి మాట్లాడుతూ దర్శకుడు శివమణితో వన్ డే మ్యాచ్ లా నా పెళ్లి అయిపోయిందని తులసి వెల్లడించారు.

బెంగళూరులో మా తాతగారు కట్టిన సాయిబాబా గుడిలో పెళ్లి జరిగిందని తులసి అన్నారు.నిజం చెప్పాలంటే నేను బీదవాడిని పెళ్లి చేసుకున్నానని ఆమె కామెంట్లు చేశారు.ఆ సమయంలో మా అత్తగారు పాచి పనులు చేసేవారని తులసి చెప్పుకొచ్చారు.

నేను ఆ ఇంటికి కోడలిగా అడుగు పెట్టిన తర్వాత ఆ ఇంటికి ఆస్తి కలిసొచ్చిందని తులసి తెలిపారు.

అయితే ఆస్తి వచ్చినా మా ఆయన హీరోగా సినిమాలు చేయడం వల్ల అప్పులపాలు కావాల్సి వచ్చిందని తులసి వెల్లడించారు.నేను మిణుగు తార అనే మూవీ రాశానని ఆ సినిమా సక్సెస్ సాధిస్తే గుడి లోపల ప్రభావళి చేస్తానని మా ఆయన మొక్కుకున్నారని అనుకున్న విధంగానే సినిమా సూపర్ హిట్ అయిందని తులసి అన్నారు.

ఆ సినిమాకు 13 కోట్ల రూపాయల లాభం వచ్చిందని అయినా మొక్కు తీర్చకపోవడంతో వచ్చింది వచ్చినట్టు పోయిందని తులసి పేర్కొన్నారు.ఒకరోజు సాయిబాబా నా కలలోకి వచ్చి ఏడు జన్మలకు నువ్వే నా తల్లి అని చెప్పారని ఆరేళ్ల తర్వాత కడుపులో పుడతానని చెప్పారని తులసి చెప్పుకొచ్చారు.ఆరేళ్ల తర్వాత నాకు కొడుకు పుట్టగా సాయి అని పేరు పెట్టానని తులసి కామెంట్లు చేశారు.

హీరోయిన్ సావిత్రి అక్షయపాత్ర లాంటి వారు అని ఎవరేం అడిగినా ఆమె ఇచ్చేవారని చివరి రోజుల్లో సావిత్రి నరకం అనుభవించారని తులసి అన్నారు.

మా తాతగారు హీరోయిన్ గా ఫేడవుట్ అయిన తర్వాత నేను తల్లి పాత్రలతో మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పారని ఆయన చెప్పిందే నిజమైందని తులసి అన్నారు. అన్ని భాషల్లో కలిపి 700 కి పైగా సినిమాల్లో నటించిన తులసి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు.