అజిత్ ప్రముఖ దక్షిణాది నటుడు. అజిత్ 1971లో హైదరాబాదులోని సికింద్రాబాద్ లో జన్మించాడు. తన నట జీవితాన్ని ప్రేమ పుస్తకం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. తరువాత తనకు తమిళ్ మాట్లాడానికి రాకపోయినా తమిళంలో చాలా సినిమాలు నటించి దక్షిణాది లో ఉన్న ప్రముఖ నటులలో ఒకరుగా తనదైన ముద్ర వేసుకున్నాడు. తాను చదివింది పదవ తరగతి మాత్రమే అయిన తెలుగు, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు.
అసలు విషయానికి వస్తే.. ప్రేమలేఖ సినిమాలో తనతో పాటు నటించిన హీరాతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమలేఖ సినిమా మంచి ప్రేమ కథ చిత్రం గా పేరుపొంది మంచి సక్సెస్ ను సాధించింది. హీరా, అజిత్ లు పెళ్లి చేసుకుంటారని తెలిసిన వారందరూ అనుకున్నారు. హీరా కూడా మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఆమె కూడా పలు సినిమాలలో హీరోయిన్ గా రాణించింది.
అయితే ముఖ్యంగా అజిత్ ఎదగడానికి కారణం హీరానే. తాను హీరోయిన్ గా రాణిస్తున్నప్పుడు అజిత్ కు అవకాశాలు లేవు తానే తనకు తెలిసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ హౌస్ లకు అజిత్ ను పరిచయం చేసింది. మొదట తమిళంలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కొంతకాలానికి సైడ్ హీరోగా చేస్తూ చివరికి సోలోగా నిలబడే స్థాయికి వచ్చేసాడు అజిత్. వీరిద్దరూ కలిసి కొంతకాలం సహజీవనం కూడా చేశారు అని సమాచారం. ఒక ఇంటర్వ్యూలో తాను హీరాను పెళ్లి చేసుకుంటానని స్వయంగా ప్రకటించాడు అజిత్.
ఇలా కొనసాగుతుండగా శాలిని తో ఒక సినిమా చేసి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి తనే ఎదురుగా కోటి రూపాయలు ఎదురు కట్నం ఇచ్చి శాలిని వివాహం చేసుకున్నాడు. హీరాను వదిలించుకోవడానికి తనకు డ్రగ్స్ అలవాటు ఉన్నాయని అంటే దానికి హీరా నన్ను వదిలించుకోవడానికి ఇలా చెప్తున్నాడు అని చెప్పుకొచ్చింది. 2000 సంవత్సరంలో అజిత్, శాలినిని వివాహం చేసుకున్నాడు. తర్వాత హీరా కూడా వేరే అతనిని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.