చత్రపతి శేఖర్ తెలుగు చలనచిత్ర నటుడు. ఇతని అసలు పేరు చంద్రశేఖర్.. వృత్తిపరంగా చత్రపతి శేఖర్ గా పిలవబడుతున్నాడు. ప్రధానంగా తెలుగు సినిమాలలో ఇంకా టీవీ సీరియల్స్ లలో రాణించిన నటుడు. ఇతను ఎస్ఎస్ రాజమౌళితో తరచుగా కలిసి పని చేయడం వల్ల ఆ పరిస్థితి చెందాడు.
2001లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. తర్వాత సింహాద్రి, సై, చత్రపతి సినిమాలలో నటించడం ద్వారా అనతి కాలంలోనే బాగా గుర్తింపు పొందాడు. ఇక వరుస అవకాశాలతో సినీ ఇండస్ట్రీలో బిజీగా కొనసాగాడు.
చత్రపతి శేఖర్ ఎక్కువగా సినిమాలో హీరో చుట్టూ తిరిగే పాత్రలలో పోషించడం వల్ల తొందరగా పాపులర్ అయ్యాడు. ఇలా వరుసగా ఒక వైపు సినిమాలలో.. మరొకవైపు బుల్లితెరలో బిజీగా రాణిస్తున్న చత్రపతి శేఖర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆ ఇంటర్వ్యూలో తాను తమిళంలో అజిత్ తో చేసిన సినిమా గురించి తన అభిప్రాయం ఏంటని ప్రశ్న ఎదురైంది. అందుకు తాను అజిత్ సినిమాలో సమ్మర్ లో వర్క్ చేయడం జరిగింది అని తెలిపాడు. ఎండలో షూటింగ్ జరుగుతున్నప్పుడు అజిత్, డైరెక్టర్ షాట్ ఓకే అనే వరకు ఎంతసేపైనా ఎండలోనే నిలబడడం చూసి ఆశ్చర్యంగా చూశానని తెలిపాడు.
అంత ఎండలో ఆయన చాలాసేపు నిలబడడం చూసి, ఆయన ఇంత గొప్ప వాడా అని అనుకున్నట్లు చెప్పాడు. ఇక సినిమాలో అజిత్ కు తాను ఫ్రెండ్ క్యారెక్టర్ లో వర్క్ చేశానని.. చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు. ఒకరోజు సెట్లో అందరికీ స్వయంగా చికెన్ వండి తినిపించడం జరిగింది.
తనకైతే ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయినంత పని అయింది. అంత గొప్ప నటుడితో నటించడం సంతోషం కలిగింది అని చెప్పాడు. ఇక ఈయన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన బుల్లితెరలో ప్రసారమయ్యే ఈటీవీలో రంగుల రత్నం సీరియల్ లో నటిస్తున్నారు.