విడాకులకు సిద్ధమైన టాలీవుడ్ యంగ్ హీరో నితిన్… అసలు మేటర్ ఏంటంటే?

జయం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి హిట్ అందుకున్న నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సై, దిల్, గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్, అ ఆ, భీష్మ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు పొందిన నితిన్ ఇటీవల మాచర్ల నియోజకవర్గం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే ఊహించిన స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత భీష్మ సినిమా ఫేం డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో మరొక సినిమా చేయటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఈసారి నితిన్ కోసం వెంకీ కొడుముల ఒక వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో తన భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా జీవించే ఒక భర్త పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. భార్యకు దూరమై ఆ ఎడబాటుతో జీవించే ఓ మగాడి కథ ని వెంకీ చాలా ఫన్నీగా రెడీ చేసినట్లు సమాచారం. అంతే కాకుండా నితిన్‌ కి కూడా సినిమా స్క్రిప్ట్ బాగా నచ్చినట్లు తెలుస్తొంది. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం.

ఛలో, భీష్మ సినిమాలతో నితిన్ కి మంచి హిట్స్ ఇచ్చిన వెంకీ కుడుముల ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. నితిన్ కి కూడా ఈ కథ నచ్చటం తో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తొందర్లోనే ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం. మైత్రి మూవీ బ్యానర్స్ సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తనకి తెరకెక్కిస్తోంది. ఇక నితిన్ కూడా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాచర్ల నియోజకవర్గం సినిమా నితిన్ అని నిరాశ పరిచినా కూడా ఈ సినిమా ద్వారా హిట్ దక్కుతుందని నితిన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.