చిత్ర పరిశ్రమలో ఒక సినిమా తీయాలంటే కథ, నటీనటులు, దర్శకుడితోపాటు బడ్జెట్ అనేది చాలా ముఖ్యమైనది. సినిమా సక్సెస్ కాకపోతే ఎక్కువగా నష్టపోయేది నిర్మాతనే. అదే సినిమా సక్సెస్ అయితే ఎక్కువ లాభపడేది నిర్మాతనే. తక్కువ బడ్జెట్ తో వచ్చి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమాలు ఏమిటో చూద్దాం.
ఉయ్యాల జంపాల: ఈ సినిమా 2013లో విడుదల అయింది. సినిమా బడ్జెట్ 80 లక్షలు అయితే కలెక్షన్ల పరంగా 16 కోట్లను వసూలు చేసింది.
భలే భలే మగాడివోయ్: ఈ చిత్రం 2015 లో విడుదల అయింది. సినిమా బడ్జెట్ 7 కోట్లు అయితే కలెక్షన్ల పరంగా 50 కోట్లను వసూలు చేసింది.
బిచ్చగాడు: ఈ చిత్రం 2016లో విడుదల అయింది. సినిమా బడ్జెట్ 50 లక్షలు అయితే కలెక్షన్ల పరంగా 42.25 కోట్లను వసూలు చేసింది.
పెళ్లిచూపులు: ఈ చిత్రం 2016 లో విడుదల అయింది. సినిమా బడ్జెట్ కోటి రూపాయలు అయితే కలెక్షన్ల పరంగా 30 కోట్లను వసూలు చేసింది.
ఫిదా: ఈ చిత్రం 2017లో విడుదలయింది. సినిమా బడ్జెట్ 13 కోట్లు అయితే కలెక్షన్ల పరంగా 90 కోట్లను వసూలు చేసింది.
కేశవ: ఈ చిత్రం 2017 లో విడుదలైంది. సినిమా బడ్జెట్ 3 కోట్లు అయితే కలెక్షన్ల పరంగా 30 కోట్లను వసూలు చేసింది.
గీత గోవిందం: ఈ చిత్రం 2018 లో విడుదల అయింది. సినిమా బడ్జెట్ 5 కోట్లు అయితే కలెక్షన్ల పరంగా 132 కోట్లను వసూలు చేసింది.
ఆర్ఎక్స్ 100: ఈ చిత్రం 2018 లో విడుదల అయింది. సినిమా బడ్జెట్ 2 కోట్లు అయితే కలెక్షన్ల పరంగా 20 కోట్లను వసూలు చేసింది.
సాయి శ్రీనివాస్ ఆత్రేయ: ఈ చిత్రం 2019లో విడుదల అయింది. సినిమా బడ్జెట్ 1.5 కోట్లు అయితే కలెక్షన్ల పరంగా 20 కోట్లను వసూలు చేసింది.
జాతి రత్నాలు: ఈ చిత్రం 2021 లో విడుదలైంది. సినిమా బడ్జెట్ 4 కోట్లు అయితే కలెక్షన్ల పరంగా 70 కోట్లు వసూలు చేసింది.
కార్తికేయ 2: ఈ చిత్రం 2022లో విడుదలైంది. సినిమా బడ్జెట్ 15 కోట్లు అయితే కలెక్షన్ల పరంగా 120 కోట్లను వసూలు చేసింది.