నేచురల్ స్టార్ నాని హీరోగా తన మొదటి సినిమాకు అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా నిలదొక్కుకున్న వారిలో నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. నాని చాలాకాలం అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు పని చేశాడు. రాజమౌళి, రాఘవేంద్రరావు,బాపు వంటి దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం నానికి ఉంది. అయితే ఇంద్ర గంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరికేక్కిన అష్టా చమ్మ సినిమా ద్వారా హీరోగా నాని ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. నాని, కలర్ స్వాతి జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాలో నాని నటన, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ క్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో నాని కి టాలీవుడ్ లో వరుసగా హీరో అవకాశాలు వచ్చాయి.

ఆ సినిమా తర్వాత నాని నటించిన పిల్ల జమిందార్, స్నేహితుడు, భలే భలే మగాడివోయ్ వంటి సినిమాలు వరుసగా హిట్ అవటంతో నాని నేచురల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. నాని సినిమా అంటే కచ్చితంగా హిట్ అవుతుందని నిర్మాతలకు మంచి నమ్మకం ఏర్పడింది. ఇలా వరుస సినిమాలలో నటిస్తు టాలివుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం నాని ఒక్కో సినిమాకి కొన్ని కోట్లలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. అయితే ఇటీవల నాని మొదటి సినిమా రెమ్యూనరేషన్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.

అసిస్టెంట్ డైరెక్టర్ నుండి అష్టా చమ్మా సినిమా ద్వారా నాని హీరోగా పరిచయం అయ్యాడు. సాధారణంగా అసిస్టెంట్ డైరెక్టర్లకు రెమ్యూనరేషన్ పెద్దగా ఉండదు. వీరికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని నేర్పించి కేవలం మూడు పూటలా ఫుడ్ మాత్రం పెడతారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాని అష్టా చమ్మ సినిమాలో హీరోగా నటించినప్పటికీ ఆ సినిమా కోసం ఎటువంటి రెమ్యూనరేషన్ అందుకోలేదు. ఇలా ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నాని అష్టాచమ్మా సినిమా కోసం పనిచేశాడు. ప్రస్తుతం నాని ఒక్కో సినిమాకి ఎనిమిది కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు. ఇక నాని నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. నాని, కీర్తి సురేష్ జంటగా దసరా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30న విడుదల చేయనున్నారు.